హైదరాబాద్ లో వీధికుక్కలు వీర విహారం సృష్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న వీధి కుక్కల దాడిలో ఓ పసిబాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. కొన్ని చోట్ల మనుషులపై ఎగబడి దాడికి పాల్పడుతున్నాయి. ఇది రేబిస్ వ్యాధికి దారితీస్తుంది. చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. వీధికుక్కల బెడదను నియంత్రించడంలో ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి.
ఇంకో రెండు రోజుల్లో నవంబర్ నెల ముగియబోతుంది.. డిసెంబర్ నెల ప్రారంభం కాబోతుంది.. ప్రతి నెలలాగే డిసెంబర్ నెలలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి.. బ్యాంకింగ్ రంగం నుంచి టెలికాం రంగానికి ఈ మార్పులు జరగనున్నాయి. అలాగే ఇంటి వంటగదిపై కూడా ప్రభావం చూపుతుంది. మరోవైపు, నవంబర్‌లోని కొన్ని రోజులు సీనియర్ సిటిజన్‌లకు కూడా చాలా ముఖ్యమైనవి.. డిసెంబర్ 1 నుంచి మారుతున్న కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లో మార్పులు..…
Ola Scooters: ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం పెరుగుతుండటంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇండియాలోనూ ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2022 ఏడాదిని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఘనంగా ముగించింది. డిసెంబర్ నెలలో మొత్తంగా 25 వేలకు పైగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడుపోయాయి. దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‍లో ఓలా 30 శాతం వాటాను దక్కించుకుంది. ఒకే నెలలో 25వేల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు…
Marriages Season: తెలుగు రాష్ట్రాలలో పెళ్లి సందడి ప్రారంభమైంది. మూఢాల కారణంగా మూడు నెలలుగా శుభకార్యాలకు చెక్ పడింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి 21 వరకు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. దీంతో 20 రోజుల పాటు పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే లక్ష పెళ్లిళ్లు జరగనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో మొత్తం కలుపుకుంటే దాదాపు 5 లక్షల పెళ్లిళ్లు జరగనున్నట్లు సమాచారం అందుతోంది. అందులోనూ విదేశీ ప్రయాణాలపై కరోనా ఆంక్షలు తొలగడం,…