Water Expiry Date : దైనందిన జీవితంలో నీటికి ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పనక్కర్లేదు. అందుకే పంచభూతాల్లో నీటికి ప్రాధాన్యం కల్పించారు. ఇప్పటి వరకు నీటి గురించి చాలా వార్తలు వింటూనే ఉన్నాం.. కానీ తరచుగా వెలువడే ఓ ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. అదే నీటికి గడువుతేది(ఎక్స్ పైయిరీ డేటు) ఉంటుందా.. ఉంటే అది ఎంత కాలం?.. లేకపోతే నీరు చెడిపోవడానికి కారణం ఏంటి?
Read Also: Baba Ramdev: కోవిడ్ మహమ్మారి తర్వాత దేశంలో క్యాన్సర్ కేసులు పెరిగాయి..
ప్రస్తుతం మనం కలుషిత సమాజంలో జీవిస్తున్నాం. అందుకోసం నాణ్యమైన వస్తువుల కోసం మానవుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా ప్రపంచంలో మూడొంతులు ఉన్న నీటిని కూడా కొనుక్కొని తాగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఎక్కడ చూసినా బాటిల్ వాటర్ విక్రయాలు జరుగుతున్నాయి. ఆ విక్రయాలు ఇప్పుడు పట్టణం నుంచి గ్రామాలకు పాకింది. వాటర్ బాటిల్‌పై గడువు తేదీ కూడా రాసి ఉంటుంది. అందుకే నీటి ఎక్సయిరీ డేట్ లేకుంటే బాటిళ్ల పైన ఎందుకు రాసుకున్నారనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. దీనికి సమాధానం కూడా తెలుసుకోవాలి.
Read Also: Kunchala Prabhakar: ఆలయంలో వైస్ చైర్మన్, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం.. షాక్‌లో భక్తులు
వాటర్ బాటిళ్లపై రాసి ఉన్న గడువు తేదీ నీళ్లది కాదని, వాటర్ బాటిళ్లదేనని నిపుణులు చెబుతున్నారు. నీటి సీసాలు ప్లాస్టిక్‌తో తయారు చేయబడతాయి.. నిర్దిష్ట సమయం తర్వాత ప్లాస్టిక్ నీటిలో నెమ్మదిగా కరిగిపోతుంది. నీళ్లతో నింపిన బాటిళ్లపై గడువు తేదీ రాసి ఉండడానికి ఇదే కారణం. ఇప్పుడు నీటికి గడువు తేదీ ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. సమాధానం లేదు! నీటిని శుద్ధి చేయడంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. నీటిని ఎక్కువసేపు ఒకే చోట ఉంచితే, తాగే ముందు తప్పనిసరిగా శుభ్రం చేయాలి అని స్పష్టంగా పేర్కొన్నారు. నీటికి గడువు తేదీ(ఎక్స్ పెయిరీ డేట్) లేదు!