NTV Telugu Site icon

Shock : అమ్మాయి కడుపులో అరకేజీ వెంట్రుకలు.. ఆపరేషన్ చేసిన డాక్టర్లే షాక్

Hair

Hair

Shock : ఓ అమ్మాయికి ఆపరేషన్ చేసిన వైద్యులు కంగుతిన్నారు. ఆ అమ్మాయి కడుపులో దాదాపు అరకేజీ వెంట్రుకల ఉండను తొలగించారు. ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్సకు మైసూరులోని అపోలో ఆస్పత్రి వేడుకైంది. ఓ 11ఏళ్ల బాలిక ఒత్తిడిలో ఉన్నప్పుడల్లా నెత్తిమీద వెంట్రుకలను తీనడం అలవాటు చేసుకుంది. అలా ఎనిమిది నెలలపాటు తల్లిదండ్రులకు తెలియకుండా తల వెంట్రుకలను పీక్కుతినేది.. ఈ క్రమంలో ఆమె కడుపునొప్పికి గురైంది. ఎన్ని ఆస్పత్రులకు తీసుకెళ్లినా నయం కాలేదు. ఆఖరుకు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌కు చూపించగా, ఆమెను క్షుణ్ణంగా పరీక్షించి ఎండోస్కోపీ చేశారు.

Read Also: Brazil President: బ్రెజిల్‌ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్లా

ఆ అమ్మాయి కడుపులో ఒక పెద్ద ఉండ ఉన్నట్లు కనుగొన్నారు. ప్రస్తుతం అది ఆహార పదార్థాలతో కలిపి గడ్డగా మారింది. అప్పుడు వైద్యులు ఆమెకు లాపరోస్కోపిక్ ఆపరేషన్ చేశారు. 15 x 20 x 5 సెం.మీ. కొలతలు కలిగి 500గ్రాముల బరువున్న వెంట్రుకల ఉండను వైద్యులు తొలగించారు. మైసూరులోని అపోలో బిజిఎస్ హాస్పిటల్స్‌లోని చీఫ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ నైరుత్య శివతీర్థన్ ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఆర్తీ బెహ్ల్ ఆ యువతికి కౌన్సెలింగ్ ఇచ్చినప్పుడు ఒత్తిడికి గురైనప్పుడల్లా నెత్తిమీద వెంట్రుకలను తినడం తన అలవాటని ఆమె పేర్కొంది. తీవ్ర కడుపునొప్పితో ఆ బాలిక స్కూల్ కి వెళ్లడం కూడా మానేసింది. ఆపరేషన్ అనంతరం ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది.

Show comments