HYD SKLM SUICIDES: పాపం ఈ భర్తకి అంత కష్టమేం వచ్చిందో.. ఇంట్లో నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు వెళ్లి..
- పాపం ఈ భర్తకి అంత కష్టమేం వచ్చిందో
- కాపురాల్లో కల్లోలం
- ఓ వైద్యుడు కూడా భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుటుంబ కలహాలు ఉసురు తీస్తున్నాయి. నిత్యం గొడవల కారణంగా.. కాపురాల్లో కల్లోలం రేగుతోంది. కారణాలు ఏవైనా కానీ.. భర్త లేదా భార్య మాత్రం కాపురాల్లో జరుగుతున్న గొడవలను తట్టుకోలేక.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అంతే కాదు.. ఇలాంటి ఘటనల్లో అప్పుడప్పుడు వారికి పుట్టిన పిల్లలు కూడా సమిధలుగా మారుతున్నారు. తాజాగా హైదరాబాద్ కీసరలో ఓ వైద్యుడు కూడా భార్య వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. అటు శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ.. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది.
Also Read
భర్త అంటేనే భరించేవాడంటారు !! పాపం ఈ భర్తకి అంత కష్టమేం వచ్చిందో !! ఇంట్లో నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు వెళ్లి తన కారులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కారులో విగతజీవిలా పడి ఉన్న ఇతని పేరు డాక్టర్ జోసెఫ్ వినోద్ కుమార్. మేడ్చల్ మండలం కీసర పరిధి.. అహ్మద్ గూడలో ఉంటున్నాడు. గత కొంతకాలంగా భార్య వీణాపాణితో విభేదాలు వచ్చాయి. భార్య భర్త మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. తరుచూ గొడవపడేవాళ్లని తెలుస్తోంది. ఈ క్రమంలో వీణాపాణి మార్చి 31న భర్త జోసెఫ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జోసెఫ్‌ను పిలిచి విచారించారు… స్పాట్…
భార్య చేసిన పనివల్ల తాను పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వచ్చిందని.. మనస్థాపానికి గురయ్యాడు జోసెఫ్. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇంట్లో నుంచి తన కారు తీసుకుని ఔటర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లాడు. వెళ్తూ… భార్యకి తన లైవ్ లొకేషన్ షేర్ చేశాడు. ఔటర్ రింగ్ రోడ్డులో కారును పక్కకు ఆపి.. తన వెంట తెచ్చుకున్న ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో పనుల్లో నిమగ్నమైన భార్య.. ఆలస్యంగా భర్త చేసిన మెసేజ్ చూసుకుంది. లైవ్ లొకేషన్ మాత్రమే పంపడంతో భార్యకి అనుమానం వచ్చింది. భర్తకి కాల్ చేస్తే.. కాల్ ఆన్సర్ చేయడం లేదు. దీంతో… భర్త షేర్ చేసిన లొకేషన్‌ను చేరుకుంది భార్య. అప్పటికే జోసెఫ్ చనిపోయి ఉన్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జోసెఫ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కారులో లభించిన ఇంజక్షన్, నీడిల్ స్వాధీనం చేసుకున్నారు. స్వతహాగా డాక్టర్ కావడంతో… ఇంజక్షన్ ద్వారా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. జోసెఫ్ తీసుకున్న ఇంజక్షన్ ఏంటి? అనే వివరాలు రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తాయంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కీసర పోలీసులు. బంధువులు, స్థానికుల వివరాల ప్రకారం.. భార్యతో విభేదాల కారణంగానే జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు.
Also Read:Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు
మరోవైపు కుటుంబ కలహాలు శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ ఉసురు తీశాయి. నరసన్నపేట మండలంలో ట్రైన్ కింద పడి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమెతోపాటు ఉన్న ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా బొంతల కోడూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి జ్యోతిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాల వల్లే ఇద్దరు పిల్లలతో సహా ట్రైన్ కింద పడినట్లు తెలుస్తోంది. కంబకాయ రైల్వే ట్రాక్‌పై ఈ ఘటన జరిగింది. ఇద్దరు కుమారులు హేమంత్, పునీత్‌కు ఒకరి ఎడమ కాలు పాదం మరొకరికి కుడికాలు పాదానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్‌లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్‌కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!