NTV Telugu Site icon

Minister KTR: కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. బీఆర్ఎస్ కావాలో.. రైతులే చెప్పాలి..

Minister Ktr

Minister Ktr

తెలంగాణలో పాలిటిక్స్ మంచి రసవత్తరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మీద రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా.. కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ పార్టీ కావాలో తెలంగాణ రైతులే తెల్చుకోవాలని ఆయన సూచించారు.

Read Also: Tamota : సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం టమాటా అమ్మకాలు.. కిలో ఎంతో తెలుసా?

కాగా, మంత్రి కేటీఆర్‌ ఇవాళ (శనివారం) బీఆర్‌ఎస్‌ శ్రేణులతో టెలీకాన్షరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఉచిత విద్యుత్‌ రద్దుతో పాటు కేవలం రైతులకు మూడు గంటల విద్యుత్‌ చాలన్న హస్తం పార్టీ విధానంపై ప్రతీ గ్రామంలో చర్చ జరగాలి అని ఆయన అన్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Read Also: Sitara: ఇది కదా పెంపకం అంటే.. తండ్రి బాటలోనే కోటి దానమిచ్చిన సితార?

ఈనెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు రైతు సమావేశాలు జరుగుతాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతీ రైతు వేదిక దగ్గర రైతు సమావేశం ఏర్పాటు చేయాలి.. బీఆర్‌ఎస్‌ విధానం మూడు పంటలు.. మూడు గంటల కరెంట్‌ కాంగ్రెస్‌ విధానం పేరిట ఈ మీటింగ్స్ నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రైతులను అవమానించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి వెంటనే క్షమాపణ చెప్పేలా తీర్మానాలు చేయాలన్నారు. తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్‌ వద్దన్న రైతు వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ కుట్రను రైతాంగానికి వివరించాలని కేటీఆర్ వెల్లడించారు.