Site icon NTV Telugu

Team India: వరల్డ్ కప్ ముందు టీమిండియాను వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలు..?

Team India

Team India

2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు మరోసారి ఐసీసీ ట్రోఫీని ఇప్పటి వరకు గెలవలేదు. ఈ మధ్య కాలంలో నాలుగు టీ20 ప్రపంచకప్ లతో పాటు రెండు వన్డే ప్రపంచకప్ లు.. ఒక చాంపియన్స్ ట్రోఫీ, రెండు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ ను కూడా ఆడింది. ఫైనల్ వరకు చేరినా.. లాస్ట్ స్టెప్ లో బోల్తా పడ్డ సందర్భాలు కొన్ని అయితే.. సెమీస్ లో చతికిల పడ్డ సందర్భాలు మరికొన్ని ఉన్నాయి. ఈ క్రమంలో ఈసారి స్వదేశంలో జరిగే వన్డే వరల్డ్ కప్ ను సొంతం చేసుకొని ఐసీసీ టైటిల్స్ నిరీక్షణకు తెర దించాలనే పట్టుదలతో టీమిండియా చూస్తుంది.

Read Also: Extramarital Affair: ఓవైపు ఎఫైర్, మరోవైపు వరకట్న వేధింపులు.. చివరికి ఆ వివాహిత?

అయితే ఇది సాధ్యం కావాలంటే.. ఒకట్రెండు మ్యాచ్ ల్లో ఆడితే సరిపోదు.. నెలన్నర రోజుల పాటు క్రికెటర్స్ తమ బెస్ట్ ఇవ్వాలి.. ముఖ్యంగా నాకౌట్ దశలో సత్తా చాటాలి.. అప్పుడే భారత జట్టు ఖాతాలో మరో ప్రపంచకప్ వచ్చి చేరుతుంది. గత ఏడాది కాలంగా టీమిండియాను ఒక సమస్య తీవ్రంగా కలిచివేస్తోంది. గతేడాది ఆసియా కప్ నుంచి ఈ సమస్య మరీ ఎక్కువైంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియాకు ఇది అతి పెద్ద మైనస్ గా మారిపోయింది.

Read Also: Bedurulanka 2012: ఆగస్టు 25న కార్తికేయ, నేహా శెట్టిల ‘బెదురులంక 2012’

ఆరంభంలో కిరాక్ బౌలింగ్ చేస్తున్న టీమిండియా బౌలర్లు.. డెత్ ఓవర్స్ లో మాత్రం అమాంతం చేతులెత్తేస్తున్నారు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లలో ఇది క్లియర్ గా కనిపించింది. ఈసారి వన్డే ప్రపంచకప్ వింటర్ సీజన్లో జరుగనుంది. దాంతో డే నైట్ మ్యాచ్ ల్లో సెకండ్ ఇన్సింగ్స్ లో బౌలింగ్ చేసే జట్టుకు డ్యూ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికే డెత్ ఓవర్స్ లో పేలవ ప్రదర్శన ఇస్తున్న భారత్ కు డ్యూ ఫ్యాక్టర్ మరో ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది.

Read Also: Pankaja Munde: కాంగ్రెస్‌లో చేరడం లేదు.. ఆ ఛానల్‌పై పరువు నష్టం కేసు వేస్తా..

టీ20ల్లో అయితే చివరి 5 ఓవర్లు.. వన్డేల్లో అయితే చివరి 10 ఓవర్లలో భారత బౌలర్లు పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ కారణంగానే గతేడాది బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ ను.. ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా చేజార్చుకుంది. ప్రపంచకప్ నాటికి భారత్ డెత్ ఓవర్స్ సమస్యను అధిగమించకపోతే ఈసారి కూడా ఉత్త చేతులతో ఈ మెగాటోర్నీ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.

Exit mobile version