Rohit Sharma reveals why he eating Soil: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించిన రోహిత్ సేన.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. దాంతో ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కల నెరవేరింది. భారత్ విశ్వవిజేతగా నిలిచిన అనంతరం పిచ్‌పై ఉన్న మట్టిని రోహిత్ తిన్నాడు. అందుకు సంబందించిన ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే పిచ్‌పై మట్టిని ఎందుకు తిన్నాననే విషయాన్ని రోహిత్ తాజాగా వెల్లడించాడు.
‘బార్బడోస్ పిచ్‌పై భారత్ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గెలిచి ట్రోఫీ సాధించింది. ఈ పిచ్ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ మైదానాన్ని, పిచ్‌ను నా జీవితాంతం గుర్తుంచుకుంటా. పిచ్‌ను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మట్టిని కొద్దిగా నోట్లో వేసుకున్నా. ఈ మూమెంట్స్ చాలా ప్రత్యేకమైనవి. బార్బడోస్‌లో మా కల నెరవేరింది. చాలా సంతోషంగా ఉన్నాం’ అని రోహిత్ శర్మ తెలిపాడు. 2007 టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్నాడు. కెప్టెన్‌గా రోహిత్‌కు ఇదే మొదటి ఐసీసీ టైటిల్.
Also Read: Rahul Dravid-Virat Kohli: పోతూ పోతూ.. విరాట్ కోహ్లీకి టార్గెట్ ఇచ్చిన రాహుల్ ద్రవిడ్!
‘ప్రపంచకప్ సాధించామనే ఫీలింగ్ నమ్మశక్యంగా లేదు. ఫైనల్ మ్యాచ్ ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు అంతా ఒక కలలా అనిపిస్తోంది. తెల్లవారుజాము వరకు ఆటగాళ్లందరం కలిసి సంబరాలు చేసుకున్నాము. ప్రపంచకప్ గెలవడం ఎంతో ప్రత్యేకమైనది. ఈ విజయాన్ని నెను ఇంకా పూర్తిగా ఆస్వాదించలేదు’ అని హిట్‌మ్యాన్ రోహిత్ పేర్కొన్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో రోహిత్ సారథ్యంలోని భారత్.. ఆస్ట్రేలియాపై ఓడింది.