NTV Telugu Site icon

WTC Points Table: ఒక్క గెలుపుతోనే మార్పులు.. పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన బంగ్లాదేశ్

Bangla

Bangla

పాకిస్థాన్‌పై విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ జట్టు భారీ ఆధిక్యాన్ని అందుకుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. మరోవైపు.. అటు శ్రీలంకపై విజయంతో ఇంగ్లండ్ కూడా పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది.

World Richest Women: ప్రపంచంలోనే అత్యంత సంపన్న మహిళ.. సంపద రూ.8 లక్షల కోట్లు

రావల్పిండి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. ఈ క్రమంలో.. బంగ్లాదేశ్ జట్టు ఏకంగా ఆరో స్థానానికి దూసుకొచ్చింది. కాగా.. జట్టు మార్కుల శాతం 40కి చేరగా, జట్టు ఖాతాలో 24 పాయింట్లు చేరాయి. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉండేది. కాగా.. పాకిస్తాన్ ఈ ఓటమితో తీవ్రంగా నష్టపోయింది. ఆ జట్టు ఏడో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 22 పాయింట్లు ఉండగా పాయింట్ల శాతం 30.56గా ఉంది.

Viral Video: ఇంట్లో బెడ్ అనుకున్నావా నాయనా.. రైలు పట్టాలపై ఎలా నిద్రపోతున్నాడో చూడండి

మరోవైపు శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. శ్రీలంకపై ఓలీ పోప్‌ సారథ్యంలోని జట్టు విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సైకిల్‌లో 14 టెస్టు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ఇది ఏడో విజయం. దీంతో ఆ జట్టు ఖాతాలో 69 పాయింట్లు చేరగా.. మార్కుల శాతం 41.07కి చేరింది. ఈ క్రమంలో.. ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు నాల్గవ స్థానానికి చేరుకుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు క్లెయిమ్ చేసింది. అంతకుముందు ఇంగ్లండ్ ఆరో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. భారత్ 68.5 శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 62.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో న్యూజిలాండ్ 50 శాతంతో ఉంది.