Site icon NTV Telugu

Ram Date of Birth: శ్రీ రాముడు పుట్టింది ఎప్పుడో తెలుసా..?

Sri Ram

Sri Ram

ఇప్పుడు ఎవరి నోట విన్న అయోధ్య మాటే. అందరి చూపు అయోధ్య వైపు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుకను ప్రధాని మోదీ నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ఈ వేడుకలో దేశ, విదేశాల ప్రముఖులు పాల్గొననున్నారు. మరుసటి రోజు అంటే జనవరి 23 నుంచి భక్తులు ‘అయోధ్య రాముడు’ని దర్శించుకోవచ్చు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 11,000 మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.

Read Also: YSRCP: ఐదో జాబితాపై వైసీపీలో ఉత్కంఠ!.. సీఎం క్యాంపు ఆఫీస్‌కు క్యూ కట్టిన నేతలు

ఇదిలా ఉంటే.. శ్రీ రాముడు పుట్టిన తేదీని ఓ సంస్థ తెలిపింది. పురాణాలన్నీ రాముడు త్రేతాయుగంలోనే జన్మించాడని చెబుతూఉంటాయి. వాల్మీకి రామాయణం కూడా.. రామాయణమంతా త్రేతాయుగంలో జరిగిందేనని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ.. మనందరికీ అర్థమయ్యేలా స్పష్టమైన తేదీలేవీ చెప్పలేదు. వాల్మీకి రామాయణంలో.. శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయానికి ఆయన వయస్సు 25 ఏళ్లుగా తెలిపారు.

Read Also: Ayodhya Event: రామ మందిర వేడుక వేళ రూల్స్ ఉల్లంఘించారో AI పట్టేస్తుంది..

కాగా.. శ్రీరాముడు పుట్టిన తేదీ క్రీస్తుపూర్వం 5114వ సంవత్సరం, జనవరి 10న మధ్యాహ్నం 12.05 నిమిషాలకు అని ఇనిస్ట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గణాంకాలతో నిర్ధారించింది. మహాభారతం, రామాయణాలు, పౌరాణిక ఇతిహాసాలు.. కేవలం కల్పిత కావ్యాలు కావని, అవి చారిత్రక గ్రంధాలని సంస్థ తెలిపింది. అంతేకాకుండా.. లంకలోని అశోకవనంలో సీతాతల్లిని కలిసిన సంవత్సరం 5076 సెప్టెంబర్ 12న కలిశాడని ఆ సంస్థ తెలిపింది. మరోవైపు.. మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3,139, అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైందని పేర్కొంది.

Exit mobile version