NTV Telugu Site icon

Monsoon Tips: వర్షాకాలంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు తడిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ?

Gadgets

Gadgets

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, మరి కొన్ని రోజలు పాటు భారీ వానాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందువల్ల ఈ సీజన్ లో మీరు మీ గాడ్జెట్స్ ను జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్మార్ట్ ఫోన్ లు, ఇయర్ బడ్స్, ఇతర గాడ్జెట్స్ ను నీటి నుంచి డ్యామేజ్ కాకుండా రక్షించుకోడానికీ.. అవి తడిస్తే ఏం చెయ్యాలి అనే దానికి మీకోసం ఈ చిట్కాలు.

Read Also: Asian Games: ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడల్లో ఆడేందుకు వారికి అనుమతి

స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్‌లు వాటర్‌ప్రూఫ్ కాదు.. మీరు వానాకాలంలో బయటకు వెళ్తే, మీ గాడ్జెట్స్ ను వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లో దాచి ఉంచాలి.. తద్వారా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్‌లు వర్షంలో తడిసిపోకుండా సురక్షితంగా ఉంటాయి. ఒక వేళ మీ గాడ్జెట్స్ వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లు అతిగా తడిస్తే.. వాటిలోకి కూడా నీరు వెళ్లే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, వాటిలో ఉంచిన గ్యాడ్జెట్‌లలోకి నీరు వెళ్లి అవి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే తేమను బాగా పీల్చుకునే సిలికా జెల్ పౌచ్‌లను బ్యాగ్‌లో ఎప్పుడూ ఉంచుకోవాలి.

Read Also: Baby: వైష్ణవి చైతన్యను చెప్పుతో కొట్టిన అభిమాని.. వీడియో వైరల్

చాలా టీబ్ల్యూఎస్ ఇయర్‌బడ్‌లు ఐపీ రేటింగ్‌తో మార్కెట్ లోకి వస్తాయి. కానీ అవి వర్షంలో తడిసిన తర్వాత సరిగ్గా పని చేయవు.. అందుకే ఇయర్‌బడ్లు నీటిలో తడవకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరోవైపు, మీ ఇయర్‌బడ్లు ఐపీ67 లేదా ఐపీ68 రేటింగ్‌లో ఉన్నట్లైతే.. మీరు వాటిని వర్షంలో కూడా ఉపయోగించవచ్చు. గాడ్జెట్స్ తడిగా ఉన్నప్పుడు.. మీరు దానిని హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్ట కూడదు. ఎందుకంటే, హెయిర్ డ్రైయర్ గాలి ఉష్ణోగ్రత మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను లోపలి వైపు బాగా దెబ్బతీస్తుంది.. వాటిని మెత్తని పొడి గుడ్డతో తుడిచి.. పొడి గాలి వచ్చే ప్రదేశంలో లేదా, ఫ్యాన్ కింద పూర్తిగా ఆరేవరకూ ఉంచితే.. మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తిరిగి పని చేస్తాయి.