అద్భుత నటుడు అయిన సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘విమానం’.. ఇటీవలే ఈ సినిమా థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ లో విడుదల కాబోతుంది.జూన్ 30వ తేదీ నుంచి జీ5 లో స్ట్రీమ్ కానున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది.కొడుకు కన్న కలను నిజం చేయాలనుకునే ఓ తండ్రి చేసే ప్రయత్నమే ఈ ‘విమానం’ సినిమా కథ. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాన్ని హత్తుకుంటాయి. విమానం ఎక్కాలన్న కొడుకు కోరికను తీర్చడం కోసం ఒక తండ్రి పడే కష్టాన్ని దర్శకుడు తెరపై ఎంతో అద్భుతంగా చూపించారు. వీరిద్దరి మధ్య సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తమిళ నటుడు మరియు దర్శకుడు అయిన సముద్రఖని, నటి అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధృవన్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ మరియు ధనరాజ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
‘విమానం’ సినిమాను.. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.కిరణ్ కొర్రపాటి నిర్మాతగా యానాల శివప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఈ సినిమా.. జూన్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనసూయ.. ‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాల తర్వాత మరోసారి ఈ సినిమాలో డిఫరెంట్ పాత్రలో నటించారు. ఆమె మొదటిసారి ఒక వేశ్య పాత్రలో నటించారు. ఇక తెలుగు మరియు తమిళ భాషల్లో నటించి అద్భుత నటుడిగా పేరు తెచ్చుకున్న సముద్రఖని.. ఈ సినిమాలో వికలాంగుడిగా నటించారు.ఈ సినిమాలో ఎంతో ఎమోషనల్ ఫీల్ ను కలిగిస్తుంది. కథ బాగున్నా కానీ ఈ సినిమా కమర్షియల్ గా అయితే వర్క్ అవుట్ అవ్వలేదని తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీ లో కూడా అందరిని మెప్పిస్తుందేమో చూడాలి.