వేప ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు అందరికి తెలిసిందే. అయితే వేప కాయలు తిన్న కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. వేప కాయలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది. అంతేకాకుండా.. కడుపు సమస్యల నుండి ఉపశమనం పొందుతుంది.. చర్మ వ్యాధులను కూడా నయం చేస్తుంది.
ప్రాచీన కాలం నుండి భారతీయ ఆయుర్వేదంలో వేప చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. వేప చెట్టులోని ప్రతి భాగం – ఆకులు, కొమ్మలు, బెరడు, గింజలు, వేర్లు, పండ్లు, పువ్వులు అన్నీ సాంప్రదాయ ఆయుర్వేద చికిత్సలలో ఉపయోగించబడ్డాయి. వేప కాయలను ఉదయం ఖాళీ కడుపుతో తింటే చాలా మంచిది. వేప గింజలను పేస్ట్‌గా చేసి ముఖానికి గానీ, గాయాలకు గానీ రాయడం వల్ల మంచి ప్రయోజనం పొందుతారు. ఇవే కాకుండా.. వేప కాయలతో కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Read Also: Health Tips: చలికాలంలో శెనగ సత్తు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా..!
నోటి అల్సర్లను నివారిస్తుంది
వేప ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి నోటి పూతలకి కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్‌ను చంపుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నోటి పుండు, వాపును తగ్గిస్తాయి. అంతేకాకుండా.. నోటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నోటి అల్సర్‌లో వచ్చే నొప్పి, వాపును తగ్గిస్తాయి.
సంక్రమణను తొలగిస్తుంది
వేపకాయలలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కనిపిస్తాయి. ఇది బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్ ఏజెంట్లను చంపుతుంది. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్ శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇవి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతేకాకుండా.. రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలు, యాంటీబాడీల సంఖ్యను పెంచుతుంది.
చర్మానికి ప్రయోజనకరమైనది
వేపకాయలు మీ చర్మానికి చాలా పోషకమైన పదార్థం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మం వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా.. వేపకాయలలో విటమిన్ సి, విటమిన్ ఇ కూడా ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.