సంక్రాంతి రేసులో నుండి అజిత్ విదాముయర్చి తప్పుకోవడంతో.. సడెన్‌గా ఊడిపడింది విశాల్ యాక్ట్ చేసిన మదగజరాజా. పుష్కరకాలం క్రితం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ లీగల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సమస్యలన్నీ సాల్వ్ కావడంతో పొంగల్‌కు వచ్చి హిట్టు టాక్ మూటగట్టేసుకుంది. ఇలాగే షూటింగ్ కంప్లీట్ చేసుకుని థియేట్లరలోకి ఎంట్రీ ఇవ్వని కోలీవుడ్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిల్లో చాలా మందికి తెలిసిన క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ధ్రువ నక్షత్రం.
Also Read : Kannappa : కన్నప్పలో శివుడిగా అక్షయ్ కుమార్.. ఫస్ట్ లుక్ చూసారా..?
2013లో సూర్యతో మొదలై 2015లో విక్రమ్ చేతికి వచ్చి 2017లో షూటింగ్ మొదలై 6 ఏళ్ల పాటు సెట్స్‌పై ఉన్న ఈ సినిమా చూడాల్సిన అన్ని కష్టాలను చూసింది. ఎట్టకేలకు 2023లో గుమ్మడి కాయ కొట్టేశాడు దర్శకుడు గౌతమ్ వాసు దేవ మీనన్. అదే ఏడాది నవంబర్‌లో మూవీని తీసుకురావాలనుకున్నాడు. కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ రిలీజ్‌కు నోచుకోకుండా చేశాయి. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం రిలీజ్ కోసం డైరెక్టర్‌తో పాటు ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు.ఇక నాలుగు భాషల్లో షూటింగ్ జరుపుకున్న బాలీవుడ్ హిట్ మూవీ క్వీన్ రీమేక్‌ది కూడా సేమ్ సిచ్యుయేషన్. తమిళంలో పారిస్ పారిస్ పేరుతో తెరకెక్కిన సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని కూడా లీగల్, ఫైనాన్షియల్ ఇష్యూస్ థియేటర్లలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఇక వెంకట్ ప్రభు- జై కాంబోలో తెరకెక్కిన పార్టీ కూడా షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదలకు మోక్షం దక్కట్లేదు.
Also Read :Tollywood : హిట్ డైరెక్టర్స్ ను రిపీట్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు
విజయ్ సేతుపతి, విష్ణు విశాల్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఇదమ్ పొరుల్ యేవల్ కూడా షూటింగ్ కంప్లీటై 10 ఏళ్లు అవుతున్నా ఇంకా ల్యాబ్‌లోనే మగ్గిపోతుంది. ఎందుకంటే ప్రేమంట తెలుగులో, తమిళంలో ఏక కాలంలో షూట్ చేశారు. తెలుగులో సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తమిళ వర్షన్ యెన్ ఎండ్రాల్ కాదల్ ఎన్బెన్ ను రిలీజ్ చేసేందుకు సాహించలేదు మేకర్స్. ఈ జాబితాలో అరవింద్ స్వామి నరకసూరన్, సంతానం సర్వర్ సుందరం లాంటి ప్రాజెక్టులున్నాయి. ఇప్పుడు మదగజరాజా పాజిటివ్ వైబ్స్ చూసి ఇవి ఇష్యూస్ సాల్వ్ చేసుకుని థియేటర్లలోకి సినిమాలు దింపుతాయోమో చూడాలి.