NTV Telugu Site icon

Indian Railway: భారతీయ రైల్వే రూల్స్ తెలుసా..! వీరికి టిక్కెట్లు అక్కర్లేదు

Indian Railway

Indian Railway

భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా వేలాది రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే.. ఈ రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకులు తమ స్థలం నుండి మరొక ప్రదేశానికి సులభంగా రైళ్లలో ప్రయాణిస్తున్నారు. భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటిగా పేరు పొందింది. ఈ నెట్‌వర్క్ దేశంలోని సరిహద్దు ప్రాంతాలను పెద్ద మెట్రోలతో కలుపుతుంది. ప్రయాణీకుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి భారతీయ రైల్వే అనేక రూల్స్ పెట్టింది. అందులో.. రైలులో ప్రయాణించేటప్పుడు చిన్న పిల్లలకు టిక్కెట్లు తీసుకోవలసిన అవసరం లేదని భారతీయ రైళ్లలో ప్రయాణించే వారికి తెలుసు. అయితే.. నిర్ణీత వయోపరిమితిలోపు పిల్లలు మాత్రమే రైలులో ఉచితంగా ప్రయాణించగలరు. అయితే.. ఏ వయస్సు వరకు పిల్లలు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

Ravneet Singh Bittu: రాహుల్ గాంధీ నెంబర్-1 టెర్రరిస్ట్.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, 1 నుండి 4 సంవత్సరాల మధ్య పిల్లలు రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ పిల్లలకు ఎలాంటి రిజర్వేషన్ ఛార్జీ లేదు. అలాగే.. 5 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టికెట్ తీసుకోవాలి. 5 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లల కోసం సీటు లేకుండా ఉంటే.. హాఫ్ టికెట్ కొనవలసి ఉంటుంది. ఒకవేళ సీటు రిజర్వేషన్ కోసం టికెట్ కోసం పూర్తి మొత్తాన్ని చెల్లించాలి. భారతీయ రైళ్లలో ప్రయాణిస్తున్నట్లయితే, మీరు కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారతీయ రైళ్లలో ప్రయాణించేటప్పుడు మీరు అగ్ని, పేలుడు పదార్థాలకు సంబంధించి తీసుకువెళ్లకూడదు. అలాగే.. రాత్రిపూట రైలులో ప్రయాణించేటప్పుడు గట్టిగా మాట్లాడొద్దు.

Botsa Satyanarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వకుండా పోరాటాలు చేస్తాం..