Tatkaal Passport: ఎమర్జెన్సీగా విదేశాలకు వెళ్లాలా..? అయితే ‘తత్కాల్ పాస్ పోర్ట్’ ఎలా అప్లై చేయాలంటే..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం మాములుగా తత్కాల్ టికెట్ గురించి అందరము వినే ఉంటాము. ముక్యంగా పండగల సమయంలో ఈ మాట బాగా వింటాము. అయితే మీరెప్పుడైనా తత్కాల్ పాస్ పోర్ట్ గురించి విన్నారా..? నిజానికి అలాంటి ఓ పాస్ పోర్ట్ ఉంటుందనే విషయం కూడా మీకు తెలుసా..? ఇంతకీ ఈ తత్కాల్ పాస్ పోర్ట్ ఏమిటి..? ఇది పొందడానికి ఎలా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలోన్న విషయాలు ఇప్పుడు ఓసారి చూద్దాం. మనం కొన్ని అత్యవసర సమయాల్లో లేక చివరి నిమిషంలో తప్పనిసరిగా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వచ్చిన సమయంలో జారీ చేసే పాస్ పోర్టునే ‘తత్కాల్ పాస్ పోర్ట్’ అంటారు. ఎలాంటి పెద్ద దరఖాస్తు ప్రక్రియ లాంటివి లేకుండా, దానికోసం రోజుల తరబడి వేచి చూసే అవసరం లేకుండా, వేరే దేశాలకి ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందు కోసం ఆన్ లైన్ లోనే చాలా సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు.
Also Read: Amazon Forest: బ్రెజిల్ లో కార్చిచ్చుల బీభత్సం..!
Also Read
ఇక తత్కాల్ పాస్పోర్ట్ కోసం కావాల్సిన పత్రాలు గురించి చూస్తే.. సైట్ లో ఉండే అనెక్సర్- ఎఫ్ లో వివరించిన వెరిఫికేషన్ సర్టిఫికెట్ తోపాటు ఎలక్షన్ కార్డు, సర్వీసు ఫొటో ఐడీ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలు,
ఆయుధాల లైసెన్స్, రేషన్ కార్డు , ఆస్తి పత్రాలు, పింఛను పత్రాలు, పాన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, స్టూడెంట్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికెట్, గ్యాస్ కనెక్షన్ బిల్లు వీటిలో ఏదైనా 3 ఉంటె సరిపోతుంది. ఇక
తత్కాల్ పాస్ పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలన్నా విషయానికి వస్తే..
Also Read: WPL 2024: వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..!
ముందుగా మనం పాస్ పోర్డ్ సేవా వెబ్ సైట్ ఓపెన్ చేస్తే.. ముందుగా మన వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాంతో మనకి ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. వీటితో వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ మనకి Fresh & Reissue అనే రెండు ఆప్షన్లు కనపడతాయి. ఇందులో మనకి కావాల్సిన దాన్ని ఎంచుకోవాలి. ఆపై Tatkal అనే ఆప్షన్ను ఎంచుకోని.. అప్లికేషన్ ఫారమ్ లో అగిడే వివరాలు అన్నీ జాగ్రత్తగా నమోదు చేసి, సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత తత్కాల్ పాస్ పోర్ట్ సంబంధించిన ఫీజును కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి. ఇందుకు సంబంధించి రశీదు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇక చివరగా మీ దగ్గర్లోని పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ డేట్ ను ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది.
Tatkaal Passport, india, certificates, passport portal
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!