NTV Telugu Site icon

QR Code: క్యూఆర్‌ కోడ్ ఎలా వర్క్ చేస్తుందో మీకు తెలుసా..?

Qr Code

Qr Code

భారత దేశం డిజిటల్ యుగం వైపు పయనిస్తూ అభివృద్ది పథంలోనూ దూసుకుపోతుంది. నేడు ప్రపంచం మొత్తం మీద అత్యధిక సంఖ్యలో ప్రజలు డిజిటల్ చెల్లింపులు చేస్తుండగా.. వారిలో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నారు. అయితే దీని వెనుక పలువురు ఇంజినీర్ల సహకారం కూడా దాగుంది. వారు పలు యాప్ లను రూపొందించి.. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేశారు. డిజిటల్ చెల్లింపులలో అత్యంత ఇంపార్టెంట్ క్యూఆర్ కోడ్ మాత్రమే. దీని సహాయంతో ఎవరికైనా నగదును ఈజీగా చెల్లించవచ్చు. ఈ మాధ్యమం వల్ల ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది నగదు చెల్లింపులు చేస్తున్నారు.

Read Also: Video Call: ఆమెకు 20.. ఆయనకు 79.. న్యూడ్ వీడియో కాల్.. కట్ చేస్తే!

అయితే మీరు ఎప్పుడైనా ఈ క్యూఆర్‌ కోడ్ అంటే ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించారా..?. అయితే ఈ రోజుల్లో ప్రతిచోటా క్యూఆర్‌ కోడ్‌లను విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా ఉత్పత్తిని ట్రాక్ చేయడం, దానిని గుర్తించడంలో దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ అడ్వర్టైజ్‌మెంట్, బిల్‌బోర్డ్, బిజినెస్ విండోలో ఎక్కువగా కనబడుతుంది. కొన్నిసార్లు ఇది ఉత్పత్తి డేటాను సేవ్‌ చేయడానికి కూడా ఉపయోగ పడుతుంది. అయితే క్యూఆర్‌ కోడ్ డేటాను నిల్వ చేసేందుకు ఎన్‌కోడింగ్ మోడ్‌లను ఉపయోగిస్తుంటారు.

Read Also: NTR 30: నవంబర్ నెలలో ‘దేవర’కి ముగింపు…

బార్‌కోడ్ ఎలా వర్క్ చేస్తుందో అదే విధంగా క్యూఆర్‌ కోడ్ కూడా పనిచేస్తుంది. అయితే ఇది చూసేందుకు దానికన్నా కొద్దిగా వెరైటీగా ఉంటుంది. మనకు క్యూఆర్‌ కోడ్‌లో అనేక డాట్స్ కనిపిస్తాయి. అయితే, బార్‌కోడ్‌లో గీతలు మాత్రమే కనిపిస్తాయి. క్యూఆర్‌ కోడ్‌లో రెండు రకాలుగా ఉన్నాయి. మొదటిది స్టాటిక్ క్యూఆర్‌ కోడ్.. రెండవది డైనమిక్ క్యూఆర్‌ కోడ్.. స్టాటిక్ క్యూఆర్‌ కోడ్ స్థిరంగా ఉంటుంది.. అంటే అది ఒకసారి రూపొందించిన తరువాత దానిని మార్చలేరు. డైనమిక్ క్యూఆర్ కోడ్ అంటే అందులో ఉన్న సమాచారాన్ని తిరిగి అప్‌డేట్ చేస్తుంది.