యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ తో చేస్తున్న మొదటి సినిమా ‘దేవర’. కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ తోనే అందరిని దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా చూపిస్తూ జనతా గ్యారేజ్ ని మించిన హిట్ ఇవ్వడానికి కొరటాల శివ ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్నాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ లని రంగంలోకి దించిన కొరటాల శివ, దేవర షూటింగ్ ని శరవేగంగా చేస్తున్నాడు. ప్రీప్రొడక్షన్ కి కావాల్సినంత టైం తీసుకున్నా కూడా షూటింగ్ ని మాత్రం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ లో కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లు స్పెషల్ రోల్స్ లో కనిపించనున్న ఈ సినిమాని 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
రిలీజ్ డేట్ లో డిలే ఉండకుండా చూసుకుంటూ షూటింగ్ ని చేస్తున్నారు. ఇప్పటికే హ్యుజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో షెడ్యూల్ ని కంప్లీట్ చేసారు. దేవర అయిపోగానే ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. 2024 మార్చ్ నుంచి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఉండనుంది కాబట్టి డిసెంబర్ నెల నుంచే ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ కారణంగానే కొరటాల శివ అండ్ టీం నవంబర్ నెలలోనే దేవర షూటింగ్ కి ఎండ్ కార్డు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేసుకున్న దానికన్నా ముందే దేవర షూటింగ్ జరుగుతూ ఉండడంతో నవంబర్ నెలకి కంప్లీట్ చేయడం మేకర్స్ కి పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. మరి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.