కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ శాసన సభ ఎన్నికల్లో తన సత్తాను చాటుకున్నారు. ఆయన ధాటికి తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ విలవిలలాడి పోయింది. అయితే డీకే శివ కుమార్ కనకపుర నియోజకవర్గంలో కేవలం ఒక్కరోజే ప్రచారం చేశారు. ఎందుకంటే కేపీసీసీ చీఫ్ కావడంతో రాష్ట్రంలోని 224 నియోజకవర్గాల్లో పర్యాటించాల్సి ఉంటుంది. దీంతో తన సొంత నియోజకవర్గంలో మాత్రం ఒక్కరోజు ప్రచారం చేసినందుకే లక్ష ఓట్ల మెజారిటీతో విజయం సాధించడంతో బీజేపీకి భారీ షాక్ తగిలినట్లైంది.
Also Read : Karnataka Election Results: బీజేపీని దెబ్బకొట్టిన లింగాయత్‌లు.. చివరి నిమిషంలో కమలం పాచిక పారలేదు..
కనకపుర నియోజకవర్గం తన అడ్డా.. అక్కడ తనకు ఎదురు లేదని డీకే శివ కుమార్ ఢంకా బజాయించి మరీ చెప్పినట్లు రిజల్ట్స్ ఉన్నాయి. ఆయనే కాకుండా ప్రజలు కూడా ఈ విషయాన్ని ఓటు ద్వారా చూపించారు. అయితే కనకపుర నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ ఆశోక్ పోటీ చేశారు. డీకే శివ కుమార్ ను ఓడించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం గట్టిగానే ప్రయత్నించింది. కానీ అక్కడ పోటీలో డీకేనే గెలిచి తన సత్తా చాటుకున్నాడు. లక్షకు పైగా ఓట్ల తేడాతో అశోక్ ను ఓడించడంతో బీజేపీకి తీవ్ర నిరాశ మిగిలింది.
Also Read : Literacy Rate: అక్షరాస్యత రేటు అత్యధికంగా కలిగిన టాప్-10 దేశాలు
అయితే ఇక్కడ విచిత్రం ఏంటీ అంటే డీకే శివ కుమార్ తన సొంత నియోజకవర్గంలో కేవలం ఒక్క రోజే మాత్రమే ప్రచారం చేశాడు. మిగిలిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. లక్ష ఓట్ల ఆధిక్యంతో గెలిచి సరికొత్త రికార్డ్ ను తన ఖాతాలో డీకే శివ కుమార్ వేసుకున్నాడు. లక్ష మెజారిటీ పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేసిన డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి రేసులో నిలిచాడు.