Congress: కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. కేపీసీసీ అధ్యక్షు పదవీపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో మరో మంత్రి మాటల యుద్ధానికి దిగారు. నాయకులు ఇష్టానుసారం మాట్లాడరాదని ఇటీవలే హైకమాండ్ ఆదేశించినా పట్టించుకునే పరిస్థితి అక్కడ కనపడటం లేదు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ శాసన సభ ఎన్నికల్లో తన సత్తాను చాటుకున్నారు. ఆయన ధాటికి తట్టుకోలేక భారతీయ జనతా పార్టీ విలవిలలాడి పోయింది. అయితే డీకే శివ కుమార్ కనకపుర నియోజకవర్గంలో కేవలం ఒక్కరోజే ప్రచారం చేశారు.