గ్యాస్ ధర పెంపు పై బీఆర్‌ఎస్ డ్రామాలు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం నీ బద్నాం చేసే కుట్ర పన్నుతోందని మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. తాజాగా ఆమె మాట్లాడుతూ.. … మంత్రులకు బుద్దిలేదు… డబల్ బెడ్ రూం, 3016 ఇవ్వలేదని సీఎం దగ్గర ధర్నాలు చేయండన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ఆమె డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లో అక్కడి ప్రజల కోసం ప్రభుత్వం రెండు సిలిండర్ లు ఫ్రీ గా ఇస్తుందన్నారు. మేము అధికారంలో ఉంటే ఇక్కడ కూడా తెలంగాణ ప్రజలకి మేము ఇచేవాళ్ళమని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్ కి రాజకీయాలు చేయడమే కావాలని, మహిళా రిజర్వేషన్ బిల్లు కవితకు ఇప్పుడు గుర్తొచ్చిందా… పార్లమెంట్ లో ఉన్నప్పుడు ఏమీ చేసిందని ఆమె అన్నారు. లిక్కర్ స్కాం నుండి డైవర్ట్ చేసేందుకు ధర్నాలు చేస్తున్నారని, బీఆర్‌ఎస్ జాతీయ పార్టీ అయితే మేఘాలయ, త్రిపుర , నాగాలాండ్ లలో ఎందుకు పోటీ చేయలేదని ఆమె అన్నారు.
Also Read : Virupaksha Teaser: చేతబడులను ఆపడానికి బయల్దేరిన మెగా మేనల్లుడు
తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకే బీఆర్‌ఎస్ అని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల్లో బీజేపీ విజయంతో పార్టీ శ్రేణుల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వద్ద సంబురాలు చేసుకుంటున్నారు. నృత్యాలు చేస్తూ మిఠాయిలు తినిపించుకున్నారు బీజేపి నాయకులు. ఈ సందర్భంగా బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల్లో బీజేపీ విజయదుంభి మోగించిందన్నారు. మేఘాలయలోనూ అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందని ఆయన అన్నారు. మిత్రపక్షాలతో కలిసి మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. క్రైస్తవులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించడం మామూలు విషయం కాదని ఆయన అన్నారు. త్రిపురలో కమ్యూనిష్టులు, కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన ప్రజలు తిరస్కరించారని, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Green India Challenge:’ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పోస్టర్ విడుదల
