Site icon NTV Telugu

DK Aruna : మిషన్ కాకతీయ పేరుతో కమీషన్ల కాకతీయగా మార్చారు

Dk Aruna Comments

Dk Aruna Comments

నిజమాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పేరుతో కమీషన్ల కాకతీయగా మార్చారని మండిపడ్డారు. చెరువుల అభివృద్ధి పేరుతో నాసిరకంగా పనులు చేపట్టారని, మంత్రి ప్రశాంత్ రెడ్డి తన నియోజకవర్గంలో నాణ్యత పాటించక పోవడ వల్లే చెరువులకు గండ్లు పడ్డాయన్నారు. నాసిరకంగా పనులు చేపట్టి కమిషన్లతో డబ్బులు వెనక్కి వేసుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గరకు వచ్చింది లేదు, పరామర్శ చేసిన పాపాన పోలేదన్నారు.

Also Read : ABHB: ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.21 వేలు ప్రకటించిన ప్రభుత్వం

మోతే సమీపంలో చెక్ డ్యాంల నిర్మాణాల లోపాల వల్లే వందలాది ఎకరాలు నిట మునిగాయని, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చిలెనోడు దేశ ప్రజల కష్టాలు తిరుస్తాడా..? అని ఆమె ప్రశ్నించారు. మంత్రి భరోసా ఇవ్వడం లేడు, సీఎం కేసీఆర్ రైతుల కష్టాలు పట్టించు కోవడం లేదని, రైతుల నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి, నష్టపరిహారం వెంటనే అందించాలన్నారు. ఇసుక మేటలు వేసిన పంట పొలాలను సాగుకు యోగ్యంగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన డీకే. అరుణ ఆరోపించారు.

Also Read : Eye Flu: రాజధానిలో బీభత్సం సృష్టిస్తోన్న కండ్లకలక.. ఆసుపత్రుల్లో పెరిగిన రద్దీ

అంతేకాకుండా.. రాష్ట్రం లో రైతు ససమస్యల పై అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. భారీ వర్షాల తో రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఎలా గెలవాలని ఆలోచిస్తున్నారని, సీఎం దత్తత గ్రామం మోతె లో చెక్ డ్యాం ల నిర్మాణం లో అనేక అక్రమాలు జరిగాయన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కమీషన్లు కోసం చెక్ డ్యాం ల నిర్మాణం చేశారని, వర్షాల తో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. రైతులను పరామర్శించే దిక్కు లేదన్నారు. సీఎం, మంత్రులు ఇంజనీర్లు గా వ్యవహరిస్తున్నారని, భారీ వర్షాల తో పంట నష్ట పోయిన రైతులకు ఎకరాకు 50 వేల రూపాయల పరిహారం అందించాలన్నారు. నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఇల్లు కూలిపోయిన బాధితులకు తక్షణ సహాయం కింద 10 వేలు ఇవ్వాలన్నారు డీకే అరుణ. ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం కేసీఆర్ కు ఓటు అడిగే హక్కు ఎక్కడిది..? సీఎం తన దత్తత గ్రామం మోతే కు వచ్చి రైతుల కష్టాన్ని తెలుసుకోవాలని డీకే. అరుణ అన్నారు.

Exit mobile version