Site icon NTV Telugu

DK Aruna : ఎమ్మెల్సీ కవితకు డీకే అరుణ కౌంటర్‌.. రాజకీయాల్లో ఓనమాలు తెలియదంటూ..

Dk Aruna

Dk Aruna

రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ పై బీఅర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ఈ విషయం పై గురువారం డీకే అరుణ మాట్లాడుతూ.. ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు లేని కరోనా నిబంధనలు జనవరి 26 గణతంత్ర దినోత్సవాలకి వచ్చిందా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని బీఅర్ఎస్ ఎమ్మెల్సీ గవర్నర్ పై నోటికి వచ్చిన కూతలు కూయడం ఆ పార్టీ నాయకుల అహంకారానికి నిదర్శనమని డీకే అరుణ నిప్పులు చెరిగారు. గణతంత్ర వేడుకలు జరపని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని డీకే అరుణ ధ్వజమెత్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఅర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం తెలంగాణ ప్రభుత్వానికి వర్తించేలా లేదని, భారత దేశంలో తెలంగాణ రాష్ట్రం అంతర్భాగం కానట్లు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.

Also Read : Balakrishna Accident: హిందూపురంలో బాలయ్యకి తప్పిన ప్రమాదం

మహిళ అని కూడా గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడిన బీఅర్ఎస్ ఎమ్మెల్సీను వెంటనే బర్తరఫ్ చేయాలని డీకే అరుణ డిమాండ్ చేసారు. ఇదిలా ఉంటే.. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే , దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందన్నారు ఎమ్మెల్సీ కవిత. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకుండా.. రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాడుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ కి ధన్యవాదాలు అంటూ గవర్నర్‌ మాట్లాడిన మాటలను వీడియో ద్వారా ఆమె తమ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Also Read : Siddharth: హీరోయిన్ తో ఎఫైర్ బట్టబయలే.. కానీ, పెళ్ళికి ముందే మరీ ఇంతలానా

Exit mobile version