NTV Telugu Site icon

DK Aruna : దొంగతనం దాగదు.. ఎప్పుడో ఒక సారి బయటకు వస్తుంది

Dk Aruna On Trs Allegations

Dk Aruna On Trs Allegations

మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన వాళ్లంతా ఈ రోజు కవిత పక్కనే ఉన్నారన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దొంగతనం దాగదు… ఎప్పుడో ఒక సారి బయటకు వస్తుందన్నారు. అవినీతి బయటపడుతుందని భయపడుతున్నారని ఆమె విమర్శించారు. లిక్కర్ కేసు చాలా చిన్నది.. ఇంతకంటే పెద్దవి చాలా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కవిత తప్పు చేస్తే… తెలంగాణ ఎందుకు తలవంచుతుందని, విచారణలో తప్పులేదని చెప్పుకోండి.. విచారణలో నిజాలు తెలుస్తాయన్నారు.

Also Read : India Fuel Demand: 24 ఏళ్ల గరిష్టానికి ఇంధన డిమాండ్.. రష్యా చమురే కారణం..

కేసీఆర్ తెలంగాణ మహిళలు అంటే మీ కూతురు ఒక్కతే కాదని, మీ పార్టీ లో మహిళ ప్రజా ప్రతినిధుల కు రక్షణ లేకుండా పోయిందన్నారు. గవర్నర్ కు సీఎం కేసీఆర్ ఎంత గౌరవం ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రపతిగా మహిళకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని, రాష్ట్రం ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్‌లు ఉన్నాయని, మహిళల పుస్తెలు తెంచుతున్నావు కేసీఆర్‌ అంటూ ఆమె నిప్పులు చెరిగారు. నీ పెన్షన్ కోసం భర్తలను పోగుట్టుకోవాలా కేసీఆర్‌ అంటూ ఆమె దుయ్యబట్టారు.

Also Read : Mla Gudem Mahipal reddy: పరీక్ష సామాగ్రి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

టీ అమ్మానని మోడీ చెప్పుకున్నారని, దొంగ పాస్ పోర్ట్ లు దందా చేసి దుబాయ్ బదులు ముంబయ్ చూపెట్టామని చెప్పుకో కేసీఆర్‌.. బ్యూటీ పార్లర్ నడపామని చెప్పుకోండి తప్పులేదు.. వేల కోట్ల ఎలా వచ్చాయి, కేటీఆర్ అధికారం శాశ్వతం కాదు.. విర్రవీగకు.. కవిత సోనియా గాంధీ నీ పోగొడుతుంది…. కాంగ్రెస్ లిక్కర్ స్కాం గురించి మాట్లాడడం లేదు… ధర్నాకు పోకుండా కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.