NTV Telugu Site icon

DK Aruna : ప్రభుత్వ పనితీరుని హైప్ చేయడానికే హైడ్రా..

Dk Aruna

Dk Aruna

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎంపీ డీకే.అరుణ మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ పేరుతో రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమని, రుణమాఫీ ఒక మోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులలో 30 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని ఆమె వ్యాఖ్యానించారు. నిబంధనల పేరుతో రైతులను అయోమయానికి గురిచేసి ఇంట్లో ఒకరికే రుణమాఫీ చేస్తామంటూ రేషన్ కార్డు అంటూ అడ్డమైన సాకులు చెప్తూ రైతన్నలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. హైదరాబాద్ లో హైడ్రా ఒక డ్రామా అని, గతంలో కేసీఆర్‌ కూడా ఇలానే అయ్యప్ప సోసైటీ ని కూల్చేశారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ఇలాంటివి తెరమీదకు తీస్తున్నారని, హైడ్రా వెనుక ఏదో దాగి ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

 
QG Gang War Trailer: ‘క్యూజీ గ్యాంగ్‌వార్‌’ ట్రైలర్ విడుదల.. అదరగొట్టేసిన ప్రియమణి, సన్నీలియోన్
 

ఎన్నికల కోసమే హైడ్రా ఏర్పాటైందా అని, ప్రభుత్వాలు మారితే ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు గుర్తొస్తాయా అని ఆయన అన్నారు. ప్రభుత్వ పనితిరుని హైప్ చేయడానికే హైడ్రా అని, హైడ్రా పేరుతో హైడ్రామా వద్దన్నారు డీకే అరుణ. ప్రజలు ఇచ్చిన అవకాశాలను ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలని, 111 జీవో కొనసాగించాలన్నారు. మక్తల్లో జరిగినంత ఇసుక దందా, మట్టి దందా ఎక్కడ జరగదేమోనని, పొలాలు, చెరువుల్లోని ఒండ్రుమట్టిని తరలిస్తుంటే ప్రభుత్వం ఎలా అనుమతులు ఇస్తోందన్నారు డీకే అరుణ. జిల్లా అధికారులకు కనపడటం లేదా,ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరు అని, చెరువు తోడేస్తుంటే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నట్లు అని ఆయన అన్నారు. చట్టాన్ని తుంగలో తొక్కి ఈ ప్రాంతాన్ని నాశనం చేస్తున్న మీరు స్పందించరా అని ఆమె అన్నారు. హైదరాబాద్ లో హైడ్రా సరే కానీ మక్తల్ చెరువుల సంగతి ఏంటి అని ఆమె అన్నారు.

Maharashtra: కూలిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ విగ్రహం.. గతేడాది మోడీ ఆవిష్కరణ