DK Aruna : బడ్జెట్ బడుగు బలహీనవర్గాలకు ఊతం ఇచ్చి, దేశ ప్రగతికి దోహద పడేలా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ సమావేశాల్లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే.. బడ్జెట్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు బలహీనవర్గాల కు ఊతం ఇచ్చి, దేశ ప్రగతికి దోహద పడేలా ఉందన్నారు. అంతేకాకుండా.. రైతులకు 20 లక్షల కోట్ల రుణాలు ఇవ్వడంతో పాటు “శ్రీ అన్న ” పథకం ద్వారా చిరు ధాన్యాలు పండించే రైతులకు ప్రోత్సాహం అందించి దేశాన్ని హరిత అభివృద్ధి వైపు నడిపించే నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. నవ భారత నిర్మాణం దిశగా భారత దేశాన్ని నడిపించడానికి, దేశ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనను ఈ బడ్జెట్ వేగవంతం చేస్తుందని డీకే ఆరుణ అన్నారు.
Also Read : Layoff in paypal : నేడు పే పాల్ వంతు.. ఊడిపోయిన 2000ఉద్యోగాలు
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
పేదల ఇళ్ళ నిర్మాణం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 79 వేల కోట్లు కేటాయించడం గర్వకారణమన్నారు డీకే అరుణ. దేశ వ్యాప్తంగా 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను దిజిటలైజ్ చేయడం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించడం రైతాంగానికి మేలు చేసే చర్య అని డీకే అరుణ అన్నారు. ఇదిలా ఉంటే.. బడ్జెట్ సమావేశాల్లో.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఏ వస్తువులు చౌకగా ఉంటాయో, ఏ వస్తువుల ధరలు ప్రియంగా మారనున్నాయో వివరించారు. కేంద్ర బడ్జెట్లో మొబైల్స్, టీవీలు, కెమెరాల విడిభాగాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది కేంద్రం. దిగుమతి చేసుకునే బంగారు ఆభరణాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. అలాగే సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీని 16 శాతానికి పెంచింది.
Also Read : Budget 2023: మూలధన వ్యయం భారీగా పెంపు.. 33 శాతం పెరిగి రూ.10లక్షల కోట్లకు చేరిక
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..