Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివాళీ పండగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ముహూర్త్ ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో శుభారంభం చేశాయి. హిందూ నూతన సంవత్సరం ‘సంవత్ 2083’కు స్టాక్ మార్కెట్ సూచీలు పచ్చని రంగుతో (లాభాలతో) స్వాగతం పలికాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే పెట్టుబడిదారుల కొనుగోళ్ల ఉత్సాహంతో బెంచ్ మార్క్ సూచీలు బలమైన ర్యాలీని నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) సూచీ సెన్సెక్స్ 210 పాయింట్లకు పైగా పెరిగి ఊపందుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) సూచీ నిఫ్టీ 25,070 కీలక స్థాయిని అధిగమించి ముందుకు సాగింది.
ఈ ప్రత్యేక సెషన్లో మెటల్, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల షేర్లకు పెట్టుబడిదారుల నుంచి తీవ్ర డిమాండ్ లభించింది. ముఖ్యంగా టాటా స్టీల్, సన్ ఫార్మా షేర్లలో భారీగా కొనుగోళ్ల జోరు కనిపించింది. వీటితో పాటు అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు కొనుగోలుదారుల ఆసక్తితో లాభాల్లో పయనించాయి. అయితే.. మార్కెట్ లాభాల్లో సాగినప్పటికీ కొన్ని ప్రధాన కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.
Also Read
- CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
- Hyderabad: ఏఐ ఫొటో తెచ్చిన ప్రాణసంకటం.. ప్రిన్సిపల్, లెక్చరర్ వేధింపులతో విద్యార్థి బలి
- Shehbaz Sharif: "మా దేశ అభివృద్ధిలో హిందువుల పాత్ర కీలకం".. దీపావళి విషెస్ తెలిపిన పాకిస్థాన్ ప్రెసిడెంట్, పీఎం..
- Eluru ZP Chairperson Race: ఏలూరు జెడ్పీ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.. చింతమనేని వారసురాలా?, గంటా కుమార్తెనా?
విమానయాన సంస్థ ఇండిగో, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అలాగే ట్రెంట్, ఏషియన్ పెయింట్స్ షేర్లు కూడా క్షీణతను నమోదు చేసి రమారమి నష్టాల బాట పట్టాయి. మొత్తానికి, దీపావళి ముహూర్త్ ట్రేడింగ్ సెషన్ ఇన్వెస్టర్లకు నూతన సంవత్సరంలో సానుకూల సంకేతాలను ఇస్తూ, మార్కెట్ సూచీలు లాభాల బాటలో ముగియడం విశేషం. అయితే మార్కెట్ ముగింపు వచ్చేసరికి సూచీలు నెగెటివ్‌లో క్లోజ్ అయ్యాయి.
తాజావార్తలు
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
-
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!