Site icon NTV Telugu

Diwali : జోరుగా దీపావళి టపాసులు అమ్మకాలు

Crackers

Crackers

దీపావళి టపాసులు అమ్మకాలు రాజమండ్రిలో జోరుగా సాగుతున్నాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొనుగోలుదారులతో బాణాసంచా దుకాణాలు కలకలాడుతున్నాయి గత ఏడాది కంటే ఈ ఏడాది 20% అధికంగా ధరలు పెరుగుతున్నప్పటికీ అమ్మకాలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు కొనుగోలు దారుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ బాణాసంచాను మాత్రం తక్కువగానే కొనుగోలు చేస్తున్నారు. పిల్లలు మారం చేస్తారు గనుక కొనుగోలు చేయటం తప్పడం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు దివాలి బాణాసంచా అమ్మకానికి సంబంధించి మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.

Also Read : Election Commission: ఆ.. ప్రకటనలు ప్రసారం చేయవద్దు.. టీవీఛానెళ్లకు ఎన్నికల సంఘం లెటర్..

విశాఖలో దీపావళి సామాగ్రి అమ్మకాలు మెల్లగా ఉపందుకుంటున్నాయి..స్టాల్స్ ఎక్కువగా పెరగడంతో అమ్మకాలు అంతంత మాత్రం గానే ఉన్నాయని వ్యాపారులు అంటుంటే గత ఏడాది కంటే ఈ ఏడాది స్వల్పంగా ధరలు పెరిగాయి అని నగరవాసులు అంటున్నారు..ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్ లో సుమారు 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్డు, పర్యాటక ప్రాంతాల్లో దీపావళి వేడుకలపై ఆంక్షలు కూడా ఉండడం ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు..

Also Read : Salaar Trailer: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. ‘సలార్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్ వచ్చేసింది!

Exit mobile version