NTV Telugu Site icon

Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్‌ను హత్య చేయడానికి ప్రయత్నించింది వాణినే.. మాధురి కౌంటర్

Divvela Madhuri

Divvela Madhuri

Divvela Madhuri: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాధురి నుంచి శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందంటూ దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలకు దివ్వెల మాధురి కౌంటర్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్‌ని హత్య చేయడానికి ప్రయత్నించింది దువ్వాడ వాణినే అంటూ దివ్వల మాధురి మళ్లీ సోషల్‌ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పది రోజులు పాటు మీడియాకు దూరంగానే ఉంటానంటూ వెల్లడించిన మరుసటి రోజే మళ్లీ మాధురి తెరపైకి వచ్చి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మాధురి నుంచి దువ్వాడ శ్రీనివాస్ వాణి కుటుంబానికి హాని ఉందంటూ వాణి చేసిన వ్యాఖ్యలపై ఘాటైన విమర్శలు చేసింది మాధురి.

Read Also: Heart Attack: కోర్టులో వాదిస్తుండగా న్యాయవాదికి గుండెపోటు.. సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం

దువ్వాడ శ్రీనివాస్ మీద దాడికి పాల్పడింది దువ్వాడ కుటుంబ సభ్యులేనని దివ్వెల మాధురి ఆరోపణలు చేసింది. ఇంటి గోడలు పగలగొట్టి చంపడానికి కూడా వెనుకాడలేదని ఆమె వ్యాఖ్యానించింది. తన అనుచరులతో హత్య యత్నానికి ప్రయత్నం చేసిందంటూ ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్‌కు రెండు కోట్ల వరకు అప్పుగా ఇచ్చానని.. అవి తనకు చెల్లించాకే ఆ ఇంటిపై హక్కులు అడగాలన్నారు. రూ.6 కోట్లతో ఇంద్ర భవనం లాంటి ఇల్లు ఉంటే ఈ కొత్త ఇంటిపై మమకారం ఎందుకో అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ వీడియోలో దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన చెక్కులను మాధురి చూపించారు. రెండు సంవత్సరాలుగా లేని అనుమానం ఇప్పుడు ఎందుకు అంటూ అసహనం వ్యక్తం చేశారు దివ్వెల మాధురి.

ఇదిలా ఉండగా.. ఇవాళ ఏపీ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోకి భార్య వాణి అక్రమంగా వచ్చి ఇబ్బందులు పెడుతున్నా పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, 41ఏ నోటీసులు ఇచ్చామని కోర్టుకు పోలీసులు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకి న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ 4 వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.