రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగిందని సమాచార శాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసిందన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. “ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం.. సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పంపిణీ పూర్తి చేశాం. 61,60,825 మందికి పెన్షన్ల నగదు అందజేశాం. 4,159 కోట్ల రూపాయల పెన్షన్ మొత్తం లబ్ధిదారులకు అందాయి. 2.65 లక్షల మంది వాలంటేర్ లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పెన్షన్ పంపిణీ జరగలేదు. 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో రికార్డు స్థాయిలో 12 గంటల వ్యవధి లో పెన్షన్లు పంపిణీ చేపట్టాం. గత ప్రభుత్వ హయంలో 2.65 మంది వాలంటీర్ లు ఉన్నా ఒక్క రోజులో కేవలం 88 శాతం మాత్రమే పంపిణీ చేశారు. సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు , ఉద్యోగులు ఎంత అద్భుతం గా పని చేస్తారో అంటూ నిరూపణ అయ్యిందని సీఎం చంద్రబాబు ప్రసంశలు కురిపించారు. పెన్షన్ పంపిణీ లో పాల్గొన్న అధికారుల నుంచి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల అందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.” అని పేర్కొన్నారు.
READ MORE: Bharateeyudu 2 : భారతీయుడు 2 నుండి వావ్.. అనేలా “క్యాలెండర్ సాంగ్”
ఎక్కడకి వెళ్లినా పెన్షన్ దారులు ఆనందంతో పండుగ చేసుకున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. “చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా నాలుగు వేలు పెన్షన్, బకాయి మూడువేలు కలిపి ఏడువేలు ఇచ్చాం. 28 కేటగిరీల్లో 4408 కోట్లు నేడు పంపిణీ చేశాం. గత ప్రభుత్వం ఐదేళ్లకు వెయ్యి పెంచితే.. చంద్రబాబు 17 రోజుల పాలనలో పెంచారు. గతంలో 200 నుంచి2000 పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబు దే. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్నివిధాలా దివాళా తీయించింది. అన్ని వ్యవస్థ లను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు నిబద్ధత తో పని చేశారు.
వారి కష్టం వల్ల రాత్రి ఎనిమిది వరకు 95 శాతం నమోదు కావడం ఒక చరిత్ర. చంద్రబాబు పనితీరుకు ఈ పెన్షన్ ల పంపిణీ ఒక నిదర్శనం. చంద్రబాబు అనుభవంతో ఎపి ని అన్ని విధాలా గాడిలో పెట్టి.. అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తారు.” అని వ్యాఖ్యానించారు.