T20 World Cup 2024 Free Live on Disney+ Hotstar: ఐపీఎల్ 2024 అనంతరం టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్రపంచకప్.. జూన్ 1 నుంచి ఆరంభం కానుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి 20 దేశాలు పొట్టి కప్ కోసం పోటీపడుతున్నాయి. 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించగా.. దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. పొట్టి ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓ శుభవార్త.
Also Read: IPL 2024: ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం.. సీఎస్‌కే కెప్టెన్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్!
టీ20 ప్రపంచకప్ 2024ను ఫ్రీగా చూడొచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో మెగా టోర్నీని ఉచితంగా చూడొచ్చు. ఫోన్‌లో వీక్షించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే టీవీలో చూడటానికి మాత్రం డబ్బు చెల్లించాల్సిందే. ఐపీఎల్ 2023, వన్డే ప్రపంచకప్ 2023లను జియో సినిమా ఫ్రీగా ప్రసారం చేసిన విషయం తెలిసిందే. జియో పోటీకి రావడంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దొగొచ్చిందనే చెప్పాలి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియోతో పాటు స్పోర్ట్స్ 18 కూడా క్రికెట్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తోంది.