Disha Encounter Case : నేడు దిశా ఎన్‌కౌంటర్ కేసు విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఎన్ కౌంటర్ పై తాజాగా నేడు మరోసారి విచారణకు రానుంది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై విచారించాలని హైకోర్టును గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో గత నెల 19న హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో నేడు దిశ ఎన్‌కౌంటర్ కేసుపై మరోసారి విచారణ జరగనుంది. ఎన్కౌంటర్‌లో పాల్గొన్న వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించాలని బాధితుల తరఫు పిటిషనర్ హైకోర్టును కోరారు. అయితే.. 2019 డిసెంబర్ 6న నలుగురు ఎన్ కౌంటర్ అయ్యారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జ్యుడిషియల్ సిర్పూర్కర్ కమిషను ఏర్పాటు చేసింది. ఎన్ కౌంటర్ బూటకం అని సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది.
Also Read : NIMS : నిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ వైద్యుల భర్తీ నోటిఫికేషన్
చట్టపరమైన నిబంధనలను, పోలీస్ మాన్యువల్ రూల్స్ ను అతిక్రమించారని తెలిపింది కమిషన్. మీడియాకు విచారణ కమిషన్ కు పోలీసులు కట్టుకథలు చెప్పారని కమిషన్ తెలిపింది. ఎన్ కౌంటర్ స్థలంలో సీసీ కెమెరా పుటేజ్ దొరక్కుండా చేసిందని రిపోర్ట్ ఇచ్చింది సిర్పూర్కర్ కమిషన్. దిశ నిందుతులే పోలీసులపై కాల్పులు జరిపారనేది అబద్ధం అని రిపోర్ట్ లో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది అధికారులపై సెక్షన్ 302, 201, 34 ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు బాధితులు. ఈ కేసులో ఇప్పటికే అమికస్ క్యూరిగా దేశాయ్ ప్రకాష్ రెడ్డిని హైకోర్టు నియమించింది.
Also Read : Hyderabad Metro : మరో 45 రోజుల పాటు హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ పెంపు
Also Read
తాజావార్తలు
-
Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
-
Gyanesh Kumar: ప్రపంచంలోనే భారత్‌లో విశ్వసనీయమైన ‘సర్’ నిర్వహిస్తున్నాం
-
Kushboo Sundar: ఖుష్బూ ఇంట పెళ్లి సందడి.. కాబోయే కొత్త జంటకు పీఎం మోడీ ఆశీస్సులు!
-
Vinesh Phogat: ఆసియా క్రీడల ట్రయల్స్‌లో దుమ్మురేపిన వినేష్ ఫోగట్.. ప్రత్యర్థిపై వీరోచితం పోరాటం
-
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..