NTV Telugu Site icon

Nallamilli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లితో బీజేపీ నేతల మంతనాలు

Nallamilli Ramakrishna Redd

Nallamilli Ramakrishna Redd

Nallamilli Ramakrishna Reddy: ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గోదావరి జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. పొత్తులో భాగంగా మూడు పార్టీల మధ్య సీట్ల లెక్కలు పూర్తయ్యాయి. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అసమ్మతి నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. తనకు ప్రకటించిన సీట్‌ను బీజేపీకి ఇవ్వడంతో ఆవేదనతో ఉన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రజల దగ్గరకు వెళ్తూ తనకు న్యాయం చేయాలని అడుతున్నారు. ఇది బీజేపీ అభ్యర్ధికి ఇబ్బందిగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పురందేశ్వరి నల్లమిల్లిని బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీలోకి రావాలని నల్లమిల్లికి ఫోన్ చేసి ఆహ్వానించారు పురందేశ్వరి…. ఆమె ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన ఆయన టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. ఒకే కూటమిలో ఉంటూ ఒక పార్టీ నేతలకు ఇంకో పార్టీ గాలం విసరడం చర్చనీయాంశంగామారింది.

Read Also: CM YS Jagan: డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పేంటి?.. లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి

రామకృష్ణారెడ్డితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు పలువురు బీజేపీ నేతలు ఫోన్లో మాట్లాడారు. బీజేపీ పార్టీలోకి రావాలని రామకృష్ణారెడ్డికి ఆహ్వానం పలికారు. బీజేపీలో చేరితే జాతీయ స్థాయిలో గుర్తింపుని ఇచ్చే పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీ ఆఫర్లను నల్లిమిల్లి రామకృష్ణా రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. టీడీపీలోనే కొనసాగుతానని రామకృష్ణారెడ్డి నిర్ణయించుకున్నారు. మరోవైపు న్యాయం కోసం నల్లమిల్లి జిల్లా స్థాయి పర్యటన రెండు రోజులు వాయిదా వేసుకోవాలని పలువురు టీడీపీ అభ్యర్థులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా న్యాయం కోసం నల్లమిల్లి పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీని వీడి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనపర్తి టీడీపీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం నిర్ణయం కోసం రామకృష్ణారెడ్డి వేచి చూస్తున్నారు.