NTV Telugu Site icon

Ram Gopal Varma: తగ్గేదేలే..! ఆర్జీవీ మరో వివాదాస్పద ట్వీట్..!

Rgv

Rgv

Ram Gopal Varma: సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులతో వివాదాలు.. కేసుల్లో ఇరుకున్న సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ.. శుక్రవారం రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు విచారణను ఎదుర్కొన్నారు.. ఆర్జీవీని దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు.. అయితే, ఇదే సమయంలో.. మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకి నోటీసు జారీ చేశారు గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు. ఇంత జరుగుతున్నా.. వర్మ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా మరో ట్వీట్‌ చేశారు.. ఒంగోలు పోలీస్ స్టేషన్ లో నిన్న విచారణ పూర్తయిన అనంతరం ఎక్స్ లో స్పందించిన ఆర్జీవీ.. ”ఐ లవ్ ఒంగోలు.. ఐ లవ్ ఒంగోలు పోలీస్.. ఈవెన్ మోర్.. 3 ఛీర్స్…” అంటూ రాసుకొచ్చిన వర్మ.. పెగ్గుతో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశారు..

Read Also: Deputy CM Pawan Kalyan: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌.. ఆసక్తికర వ్యాఖ్యలు..

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ.. ఇలాంటి పోస్టులు పెట్టడం సర్వసాధారణమే.. కానీ, 9 గంటల పాటు పోలీసుల విచారణ ఎదుర్కొని వచ్చిన తర్వాత ఈ పోస్టు పెట్టడం.. చర్చగా మారింది.. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, నారా లోకేష్‌ ఫొటోలను మార్ఫింగ్ చేసిన సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన కేసులో ఆర్మీజీ ఒంగోలు పోలీసుల విచారణ ఎదుర్కొన్న విషయం విదితమే కాగా.. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో తొమ్మిది గంటలు విచారించినా బయటకు వచ్చిన తర్వాత తిరిగి మందు తాగుతున్న ఫొటోలను ఎక్స్ లో షేర్ చేశారు.. ఇక, మరో కేసులో ఏపీ సీఐడీ పోలీసుల నుంచి నోటీసులు అందుకోవాల్సి వచ్చింది ఆర్జీవీ.. ఒంగోలు వచ్చిన గుంటూరు సీఐడీ సీఐ తిరుమలరావు.. ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు.. ఈ నెల 10వ తేదీన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.. 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తీశారు ఆర్జీవీ.. అయితే, తమ మనో భావాలు దెబ్బ తీసేవిధంగా సినిమా తీశాడంటూ గత ఏడాది నవంబర్ 29వ తేదీన సీఐడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ.. దీంతో, శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో వర్మకి నోటీసు ఇచ్చారు సీఐడీ సీఐ తిరుమలరావు.