MMTS Trains: హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్స్.. ఎప్పటి నుంచో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. దీంతో ప్రతి రోజూ వేల మంది భక్తులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొనేందుకు వెళ్తుంటారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రానికి హైదరాబాద్ నుంచి రోజు పది వేల మందికి పైగా భక్తులు వెళ్తారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదగిరిగుట్టకు వెళ్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య కారణంగా గంటన్నర పాటు సిటీ దాటేందుకు టైం పడుతోంది. దీంతో బస్సుల్లో, ప్రైవేట్ వెహికిల్స్ అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దాంతో పాటు సమయం కూడా ఎక్కువగా పడుతోంది.
Read Also: Nabha Natesh : కిల్లింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ..
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
ఎంఎంటీఎస్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగర వాసులు ట్రాఫిక్ సమస్య లేకుండా తొందరగా యాదాద్రికి చేరుకోవచ్చునని కోరుతున్నారు. ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతాయని ఎప్పటి నుంచో చెబుతున్నారు. భక్తుల డిమాండ్ మేరకు హైదరాబాద్ నుంచి యాదాద్రికి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపేందుకు కేంద్ర రైల్వే శాఖ రెడీ అయ్యింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఆ పనులు పూర్తి కావాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Read Also: Poverty: భారత్‌లో తగ్గిన పేదరికం.. 41.5 కోట్ల మందికి విముక్తి..
ఎంఎంటీఎస్ ట్రైన్లు రాయగిరి స్టేషన్ వరకు పొడగించాలని గత ఆరేళ్ల క్రితమే కేంద్ర రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. మౌలాలి నుంచి ఘట్‌కేసర్ ట్రైన్లు ఉండగా.. అక్కడి నుంచి యాదాద్రికి కొత్తగా మూడో లైను వేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు సూచించింది. ఆయితే టెండర్ ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాదాద్రి ఎంఎంటీఎస్ ట్రైన్లు నడిపే విషయమై కీలక ప్రకటన చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్ర ప్రభుత్వం రూ. 330 కోట్లు నిధులు ఖర్చు పెడుతోందని చెప్పారు.
Read Also: GST Council: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ నిర్ణయం
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎంఎంటీఎస్ రెండోదశ ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు తొందరగా పనులు చేస్తున్నారు. ఇప్పటికే మౌలాలి నుంచి ఘట్‌కేసర్ వరకు 21 కిలోమీటర్ల మేర కొత్తగా రెండు లైన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 35 కిలోమీటర్ల మేర కొత్త లైను వేస్తే హైదరాబాద్ నుంచి జస్ట్ రూ.20 టిక్కెట్‌తో యాదగిరి గుట్టకు వెళ్లే అవకాశం వస్తుంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించుకోటవంతో పాటు కేవలం 40 నిమిషాల్లోనే యాదాద్రికి చేరుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!