నభా నటేష్…ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన హాట్ అందాలతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది ఈ భామ.ఎప్పుడు గ్లామర్ షో చేసే ఈ భామ తాజాగా ట్రెడిషనల్ లుక్ లోకి మారిపోయింది.ముఖ్యంగా చీర కట్టులో కనిపించి కనువిందు చేసింది.చీర కట్టులో కిల్లింగ్ లుక్స్ తో టెంప్ట్ చేస్తూ పోజులు ఇచ్చింది ఈ భామ.తన అందంతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. తను మోడల్ రంగంలో మంచి పేరు సంపాదించుకోగా ఆ హోదాతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ సోషల్ మీడియా లో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.ఇక తొలిసారిగా 2015 కన్నడం లో వజ్రకాయ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది… మూడేళ్ల తర్వాత లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈ భామ పరిచయమైంది. ఇక కన్నడ సినిమాల్లో కూడా నటించింది. తర్వాత పలు సినిమాల్లో నటించగా.. తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చేసిన చాందిని క్యారెక్టర్ ఈ భామకు మంచి పేరు తెచ్చి పెట్టింది.ఈ పాత్రలో మాస్ డైలాగ్స్ తో అదరగొట్టింది.
ఈ సినిమాలో ఈ అమ్మడు తన గ్లామర్ తో రెచ్చగొట్టింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ విజయం సాధించడంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తరువాత ఈ భామ సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో కూడా గ్లామర్ షో తో బాగా రెచ్చిపోయింది. కానీ ఈ సినిమా కూడా ఈ భామను నిరాశ పరిచింది.ప్రస్తుతం అవకాశాలు లేక సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాతో మాత్రం తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. తన సోషల్ మీడియా ఖాతాలో తనకు సంబంధించిన ఫోటో లను షేర్ చేస్తూ యువతని ఆకట్టుకుంటుంది.అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఈ భామ కొన్ని ఫొటోస్ పంచుకుంది. అందులో తను ఎర్ర చీర కట్టుకొని కాస్త నడుము అందాలను బయటపెట్టి తన కిల్లింగ్ లుక్స్ తో కుర్ర కారును రెచ్చగొట్టింది.ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.