NTV Telugu Site icon

Thaman : వచ్చే ఏడాది సందడంతా తమన్ దే

Ss Thaman On Social Media Trolls

Ss Thaman On Social Media Trolls

Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా ద్వారా నటుడిగా వెండితెర ఆరంగేట్రం చేసి తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. నటుడిగా కంటే మ్యూజిక్ డైరెక్టర్ గానే తమన్ కు పేరొచ్చింది. కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్న తమన్‌ చేతిలో ఎప్పుడూ అర డజనుకు పైగా సినిమాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో అనిరుధ్ వల్ల తమన్ సినిమాల సంఖ్య తగ్గుతున్నాయని కొందరు అనుకుంటున్నారు. కానీ తమన్ దగ్గర పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి. అఖండ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కౌర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. తాజాగా అఖండ 2 కి కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక అయ్యాడు.

Read Also:Dwaraka Tirumala: కన్నుల పండుగగా చిన వెంకన్న కళ్యాణ మహోత్సవం..

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 సినిమాకు తమనే సంగీతం అందించబోతున్నట్లు అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది. అఖండ సినిమా నుంచి బాలయ్య కు తమన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. అందుకే అఖండ మొదలుకుని వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల కోసం తమన్‌ తో వర్క్‌ చేశాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న బాలయ్య సినిమాకు సైతం తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 2024 సంవత్సరంలో తమన్‌ మ్యూజిక్ అందించిన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే అందులో ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అలాగే తమన్ పాటలకు పెద్దగా క్రేజ్ దక్కలేదు.

Read Also:Israel PM Netanyahu: తమ బందీలను వదిలేస్తే రేపే యుద్ధం ముగిస్తా..

కానీ వచ్చే ఏడాది తమన్‌ పాటలతో మారు మ్రోగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వచ్చే ఏడాదిలో తమన్‌ సంగీతం అందిస్తున్న సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ వే. నాలుగు అయిదు విడుదల కానున్నాయి. అందులో పవన్‌ కళ్యాణ్ ఓజీ సినిమా ఒకటి. అలాగే బాలకృష్ణ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలు వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. కనుక వచ్చే ఏడాదిలో ఆయన పేరుతో పాటు పాటలు మోగడం ఖాయం అనే విశ్వాశాన్ని ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది మొత్తం తమన్ బాజా బాగానే మోగనుంది.

Show comments