పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టాక.. ఆ రగడ మరింత ముదిరింది. బడ్జెట్‌లో ఎన్డీయేతర రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదని విపక్షాలు ధ్వజమెత్తాయి. అంతేకాకుండా ఇటీవల ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కూడా విపక్ష ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: Kejriwal: ఆగస్టు 12న సీబీఐ చార్జిషీట్ పరిశీలించనున్న ఢిల్లీ కోర్టు
తాజాగా ఇదే అంశంపై మంగళవారం లోక్‌సభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. బడ్జెట్ ప్రసంగంలో ఏదైనా రాష్ట్రం పేరు ప్రస్తావించనంత మాత్రాన ఆ రాష్ట్రానికి కేటాయింపులు జరపనట్లు కాదని పేర్కొన్నారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఏ రంగానికి తక్కువ కేటాయింపులు చేయలేదని తెలిపారు. బడ్జెట్‌పై లోక్‌సభలో సమాధానమిచ్చారు. రెండు రాష్ట్రాలకే అధిక కేటాయింపులు చేశామనడం సరికాదన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థ అని.. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కోవిడ్ లాంటి మహమ్మారిని అధిగమించామని చెప్పారు. యూపీఏ హయాంలో అయితే ఏ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Kaalam Raasina Kathalu: ఐదు జంటల ‘కాలం రాసిన కధలు’
వికసిత్ భారత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని నిర్మలమ్మ అన్నారు. నైపుణ్య శిక్షణ, విద్యా రంగానికి బడ్జెట్‌లో అధిక కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sangeeth Prathap: కారు ప్రమాదంలో ‘ప్రేమలు’ నటుడికి గాయాలు.. డ్రైవర్ అరెస్ట్?