Dhurandhar: ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ నటించిన ఈ చిత్రం కోట్లల్లో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ధురంధర్ భారతదేశంలో ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా కాలం తర్వాత.. రణవీర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు. అంతేకాదు.. ఈ సినిమా OTT స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ధురంధర్ రెండు భాగాలను రూ.130 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం.. ధురంధర్ సినిమా రెండు భాగాల స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ రూ.130 కోట్లు చెల్లించింది.. అంటే ఒక్కో భాగానికి దాదాపు రూ. 65 కోట్లు. OTT ప్లాట్‌ఫారమ్‌ల ప్రస్తుత ధర తగ్గినందున ఇది అతిపెద్ద డీల్‌గా చెబుతున్నారు. ఇది రణ్‌వీర్ సింగ్‌కు ముఖ్యమైన ఒప్పందం అని వెల్లడిస్తున్నారు. ఇది ఇప్పటివరకు అతని కెరీర్‌లో అతిపెద్ద OTT ఒప్పందం.
READ MORE: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. రికార్డ్ స్థాయిలో సిల్వర్ ధర
కాగా.. “ధురంధర్” డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ప్రేక్షకులను వారి నటనతో ఆకట్టుకుంది. ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్. కపిల్ శర్మ రొమాంటిక్ కామెడీ చిత్రం కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 కు పోటీగా నిలిచింది. అయితే, ఈ సినిమా విడుదల వల్ల రణ్‌వీర్ సినిమాపై పెద్దగా ప్రభావం ఉండదని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. అయితే, కపిల్ సినిమా వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. మరోవైపు.. ధురంధర్ రెండవ భాగం మార్చి 19, 2026న విడుదల కానుంది.
READ MORE: Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి.. 15 మందికి గాయాలు..
