Site icon NTV Telugu

Dhurandhar 2 : రికార్డ్ బ్రేకర్ సీక్వెల్ ‘ధురంధర్ 2’.. టీజర్ రిలీజ్ డేట్ లాక్!

Dhurandar 2

Dhurandar 2

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘ధురంధర్’ సినిమా గురించే చర్చ జరుగుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. కేవలం సింగిల్ లాంగ్వేజ్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే మార్చిలో విడుదల కానున్న ఈ క్రేజీ సీక్వెల్ టీజర్ అప్‌డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిజానికి పార్ట్ 1 ముగింపులోనే చిన్న గ్లింప్స్ చూపించినప్పటికీ, థియేటర్లలో పూర్తిస్థాయి టీజర్ కోసం అంతా ఆసక్తిగా ఉన్నారు. అయితే

Also Read : Varanasi మహేష్–రాజమౌళి ‘వారణాసి’ రిలీజ్ డేట్ రివీల్ ఎప్పుడంటే?

తాజా సమాచారం ప్రకారం, ‘ధురంధర్ 2’ టీజర్ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ జనవరి 23న సన్నీ డియోల్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘బోర్డర్ 2’ థియేటర్లలో ఈ టీజర్‌ను ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. మరి గతంలో చూపించిన కంటెంట్‌నే అటాచ్ చేస్తారా లేక సరికొత్త విజువల్స్‌తో సర్ప్రైజ్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. థియేటర్లతో పాటు సోషల్ మీడియాలో కూడా అదే సమయంలో టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Exit mobile version