Site icon NTV Telugu

Dhurandhar 2: రికార్డులు తిరగరాయడానికి వస్తున్న ‘ధురంధర్ 2’.. రిలీజ్ అప్‌డేట్‌తో బాంబ్ పేల్చిన డైరెక్టర్!

Dhurandhar

Dhurandhar

Dhurandhar 2: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తర్వాత సూపర్ హిట్ టాక్‌తో, వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకున్న సంచలన సినిమా.. ధురంధర్. బాలీవుడ్‌లో రీసెంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన చిత్రం ధురంధర్. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నెలన్నర దాటినా.. ఇప్పటికీ బాలీవుడ్‌లో ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు.. ఈ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ధురంధర్ పార్ట్ 2 రిలీజ్‌ డేట్‌ను మేకర్స్ ఇప్పటికే రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ధురంధర్ పార్ట్ 2 చిత్రాన్ని మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు గతంలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

READ ALSO: BJP National President: కమలం పార్టీలో నడ్డా శకం ముగిసింది.. బీజేపీకి నయా సారథి ఇతడే!

అయితే ఇటీవల కాలంలో ధురంధర్ పార్ట్ 2 రిలీజ్‌ పోస్ట్ పోన్ అయ్యిందంటూ సోషల్ మీడియా వేదిక జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ డేట్‌కు మరికొన్ని సినిమాల‌తో క్లాష్ ఉంది. ఈ కానీ ధురంధర్ పార్ట్ 2 రిలీజ్‌ పోస్ట్ పోన్ అయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదంటూ డైరెక్టర్ ఆదిత్య ధర్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. ఈ రూమర్స్‌పై చిత్ర దర్శకుడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ధురంధర్ 2 రిలీజ్ డేట్ మార్చి19 నే అంటూ కన్ఫర్మ్ చేశాడు. దీంతో ఇప్పటి వరకు ఈ చిత్ర రిలీజ్‌పై జరుగుతున్న రూమర్స్‌కి ఆయన చెక్ పెట్టినట్లు అయ్యింది. బాలీవుడ్ చరిత్రలోనే ధురంధర్ అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే మార్చి 19న రాబోతున్న ధురంధర్ 2 ఎంతలా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

READ ALSO: UP Video: ముఖ్యమంత్రి చెవిలో బుడ్డోడు గుసగుసలు.. వింతైన కోర్కెకు నవ్వుకున్న యోగి

Exit mobile version