Box Office : ధురంధర్ – 2 దాటికి విలవిలలాడిన ఉస్తాద్ భగత్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత గురువారం (మార్చి 19) ఉగాది కానుకగా విడుదలైన ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) బాక్సాఫీస్ వద్ద తిరుగులేకుండా దూసుకెళ్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని సెంటర్లలో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే ఇతర చిత్రాలకు థియేటర్లు దొరకడమే కష్టంగా మారింది. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, రాయలసీమ వంటి కీలక ఏరియాల్లో ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్‌కు ఎక్కడ చుసిన అన్ని షోలు హౌస్‌ఫుల్ అవుతుండటం విశేషం.
Also Read : NBK : బాలయ్య భారీ ప్రాజెక్ట్స్.. ఒకటి కాదు ఏకంగా రెండు.. రిలీజ్ కూడా లాక్
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ధురంధర్ 2 తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ రెండో రోజు నుంచి వసూళ్లలో భారీ పతనం కనిపిస్తోంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ప్రధాన నగరాల్లో ఉస్తాద్ బుకింగ్స్ 50% లోపు మాత్రమే నమోదవుతున్నాయి. ఒకే సమయంలో విడుదలైన ‘ధురంధర్ 2’ పై ఉన్న విపరీతమైన ఆసక్తి వల్ల, ప్రేక్షకులు ‘ఉస్తాద్’ కంటే ‘ధురంధర్’ వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ధురంధర్ 2: ఏ మరియు బి సెంటర్లలో 75% పైగా ఆక్యుపెన్సీతో రికార్డులు సృష్టిస్తోంది. మూడో రోజు నాటికే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ మిశ్రమ టాక్ రావడంతో పాటు రెండో రోజు కేవలం రూ. 9 కోట్ల నెట్ వసూళ్లతో సరిపెట్టుకుంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ‘ధురంధర్ 2’ భారీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఒకవేళ ‘ఉస్తాద్’ పుంజుకోకపోతే ఈ పోటీలో ‘ధురంధర్’ ఏకపక్ష విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ధురంధర్ దాటికి ఉస్తాద్ విలవిలలాడుతోంది.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!