NBK : బాలయ్య భారీ ప్రాజెక్ట్స్.. ఒకటి కాదు ఏకంగా రెండు.. రిలీజ్ కూడా లాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ నెలలోనే ప్రారంభమైన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని బాలయ్య కచ్చితమైన గడువు విధించారు. ‘పెద్ది’ చిత్రంతో నిర్మాతగా మారుతున్న వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read : PEDDI : పెద్ది స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్ సరసన సొగసుల సుందరి
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
బాలయ్య తన 112వ చిత్రం కోసం యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివేక్ చెప్పిన కథాంశం బాలకృష్ణకు బాగా నచ్చడంతో, ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. క్లాస్ మరియు వైవిధ్యమైన సినిమాలకు పేరుగాంచిన వివేక్ ఆత్రేయ, మాస్ గాడ్ బాలయ్యను ఏ రేంజ్‌లో చూపిస్తారో అని అభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దసరా తర్వాత NBK112 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మేకర్స్ ఈ సినిమాను సమ్మర్ 2027 కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు, నాగవంశీ వంటి ప్రముఖ నిర్మాతలు పోటీ పడినప్పటికీ చివరకు మైత్రీ మూవీ మేకర్స్ ఈ అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. సినిమాకు సంబంధించి సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనను వచ్చే వేసవిలో గ్రాండ్‌గా ఇచ్చేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సిద్ధమవుతోంది. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా వివేక్ ఆత్రేయ ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారని సమాచారం.
తాజావార్తలు
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!