Dhurandhar 2 : ‘ధురంధర్ 2’ ఇండియాలో 6 నిమిషాల సీన్లు కట్.. వయోలెన్స్‌పై బోర్డు సీరియస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు (CBFC) భారీగా కోతలు విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విదేశీ వెర్షన్‌తో పోలిస్తే, ఇండియాలో విడుదలవుతున్న వెర్షన్ దాదాపు 6 నిమిషాల కంటే ఎక్కువ నిడివి తక్కువగా ఉండటం గమనార్హం.
Also Read : Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ రద్దు.. బుకింగ్స్ ఆపేసిన ‘PVR INOX’
Also Read
- Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ (Adults Only) సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ కొన్ని దృశ్యాలు మరీ భయంకరంగా ఉన్నాయని భావించి వాటిని తొలగించమని ఆదేశించింది. సెన్సార్ నివేదిక ప్రకారం చిత్ర యూనిట్ మొత్తం 21 మార్పులు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా కళ్లను తీసేయడం వంటి అత్యంత క్రూరమైన దృశ్యాన్ని తగ్గించారు. తల నరికి తన్నడం అనే సన్నివేశంపై బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అందులోని సుమారు 24 సెకన్ల భాగాన్ని పూర్తిగా తొలగించింది. సుత్తి మరియు సిమెంట్ బ్లాక్స్‌తో తలలను సుత్తితో బాదడం, సిమెంట్ ఇటుకలతో కొట్టే దృశ్యాలకు సెన్సార్ అభ్యంతరం తెలిపింది.
Also Read : sreeleela : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్
కేవలం వయోలెన్స్ మాత్రమే కాకుండా సినిమాలో మరికొన్ని కీలక సవరణలు కూడా సూచించింది సెన్సార్. డీమోనిటైజేషన్ సినిమాలో సబ్‌టైటిల్స్‌లో కనిపించే నోట్ల రద్దు తేదీలను వాస్తవ తేదీలకు అనుగుణంగా సరిదిద్దాలని బోర్డు సూచించింది. అలాగే ప్రధాన మంత్రికి సంబంధించిన రిఫరెన్స్‌లు మరియు న్యూస్ ఫుటేజీని ఉపయోగించడానికి మేకర్స్ అధికారికంగా అనుమతి పత్రాలను సమర్పించాల్సి వచ్చింది. కొన్ని అసభ్యకర పదాలను మ్యూట్ చేయడంతో పాటు, ముగింపులో వచ్చే ఎండ్ క్రెడిట్స్ నిడివిని కూడా ఒక నిమిషం తగ్గించి భారతదేశంలో ‘ధురంధర్ 2’ 3 గంటల 49 నిమిషాల 36 సెకన్ల డ్యూరేషన్ తో వస్తుండగా ఓవర్సీస్ వెర్షన్ దాదాపు 3 గంటల 55 నిమిషాల నిడివితో అన్‌కట్‌గా ప్రదర్శితం కానుంది. ఇండియాలో ఇంత భారీ నిడివి ఉన్నప్పటికీ అద్భుతమైన కథనం కారణంగా ప్రేక్షకులకు బోర్ కొట్టదని ట్రేడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?