NTV Telugu Site icon

Dhulipalla Narendra: శాసనసభలో ఇదే తొలిసారి..!

Dhulipalla

Dhulipalla

Dhulipalla Narendra: కొత్త స్పీకర్ చైర్‌లో కూర్చునే సమయంలో ప్రతిపక్షం లేకపోవడం ఇదే తొలిసారి అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. బీసీ వ్యక్తి స్పీకర్ అవుతుంటే అవమానించే విధంగా జగన్ వ్యవహరించారని.. ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల తనకు నమ్మకం లేదని మరోసారి జగన్ నిరూపించారు.. స్పీకర్ ఛార్జ్ తీసుకుంటుంటే మాజీ సీఎం జగన్ కానీ.. వైసీపీ సభ్యులు కానీ లేకపోవడం బాధాకరం అని అసెంబ్లీ లాబీల్లో మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.. గతంలో మాకు ఎంత బాధ ఉన్నా సంప్రదాయాన్ని గౌరవించాం. ఆయన (వైఎస్‌ జగన్‌) పులివెందుల వెళ్తే.. కనీసం వైసీపీ సభ్యులైనా సభకు వచ్చుంటే బాగుండేదన్నారు. పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నికపై సమాచారం ఇచ్చాం. జగన్ తనకిచ్చిన గౌరవాన్ని నిలుపుకోవడం లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పునూ వైసీపీ గౌరవించడం లేదన్నారు.

Read Also: Mallikarjun Kharge: తెలంగాణ ప్రభుత్వంపై ఏఐసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇక, జగన్ తనకు లేని హోదాను కోరుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా ఆయనకివ్వాల్సిన గౌరవం ఇచ్చాం. సభకు రాకుండా ఉండడానికి జగన్ సాకులు వెతుక్కుంటున్నారని ఆరోపించారు ధూళిపాళ్ల.. ఓటమిని జీర్ణించుకునే పరిస్థితుల్లో జగన్ లేరన్న ఆయన.. తమ్మినేని సీతారాంను స్పీకర్‌గా ఎన్నుకున్నప్పుడు అచ్చెన్నాయుడు ఆయన్ను చైరులో కూర్చొపెట్టడానికి వెళ్లారని గుర్తుచేశారు.. పరిటాల రవిని చంపినప్పుడు సభలో మేం ఆందోళన చేయాలనుకున్నాం. కానీ, చంద్రబాబు వద్దన్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాం.. వ్యవస్థలను గౌరవించాం. కానీ, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్ వాకౌట్ చేశారు.. ఇదీ ఫస్ట్ టైమే అన్నారు. నిన్న జగన్ సభలోకి వచ్చినప్పుడు మా సభ్యులెవరు ఒక్క మాట కూడా అనలేదు.. అది మా హుందాతనం అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.