KD Movie: కేజీఎఫ్ కాపీలా ధృవ సర్జా ‘కెడి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KD Movie: కన్నడ నాట ఇప్పుడు పాన్ ఇండియా మేనియా నడుస్తోంది. దీనికంతటకి కారణం ‘కేజీఎఫ్’ సీరీస్. నిజానికి కేజీఎఫ్‌కి మన ‘బాహుబలి’ స్ఫూర్తి అన్నది జగద్విదితం. ఇక కేజీఎఫ్ తర్వాత కన్నడ చిత్రరంగంలో కూడా పలువురు పాన్ ఇండియా బాట పట్టారు. ఒకరిద్దరు తప్ప అందరూ బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు ధృవ సర్జా హీరోగా దర్శకుడు ప్రేమ్ కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘కెడి’ అనే సినిమా రూపొందిస్తున్నారు. దీనికి ముందు కూడా ధృవ సర్జా ‘పొగరు’ పేరుతో పాన్ ఇండియా సినిమా చేసి నిరాశాజనకమైన ఫలితాన్ని అందుకున్నారు. అలాగే దర్శన్ ‘రాబర్డ్’, రక్షిత్ శెట్టి ‘అతడే శ్రీమన్నారాయణ, 777 ఛార్లీ’, ఉపేంద్ర ‘ఐ లవ్ యు’ సినిమాలతో పాన్ ఇండియా ఆడియ్స్ ముందుకు వచ్చారు. వీటిలో ఒక్క ‘777 చార్లీ’ మాత్రమే కమర్షియాలిటీని పక్కన పెడితే హార్ట్ టచింగ్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఇక పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ‘జేమ్స్’తో వచ్చాడు. ఒక్క కన్నడ నాట మాత్రమే ఆకట్టుకోగలిగాడు. తాజాగా రిషబ్ షెట్టి ‘కాంతారా’ సినిమా ముందు ఇంట గెలిచి ఆ తర్వాత రచ్చ ఇంటిలో విజయవిహారం చేస్తోంది.
Pooja Hegde: బుట్టబొమ్మ కాలికి గాయం.. ఆందోళనలో మహేష్ ఫ్యాన్స్
Also Read
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
ఇప్పుడు ధృవ సర్జా ‘కెడి’ సినిమా కూడా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం అవుతోంది. గురువారం ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ఆసాంతం ‘కేజీఎఫ్’, ‘పుష్ప’ ఛాయల్లోనే సాగటం విశేషం. ఇక ఈ టీజర్ ను తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సంజయ్ దత్ విడుదల చేశారు. ఇక ఇందులో తెలుగు, తమిళ స్టార్స్ కూడా ఉంటారని చెప్పారు. ఈ సినిమా హీరోయిన్ ను ఇప్పటి వరకూ నిర్ణయించలేదు. అయితే టీజర్ కు అరగంటలో 15 మిలియన్స్ వ్యూస్ వచ్చాయని ప్రకటించటం గమనార్హం. ఇది కేవలం కొన్న వ్యూస్ అనే ఇట్టే అర్థం అవుతుంది. ఎందుకంటే టీజర్ లో అంత దమ్ము లేదు. పూర్తిగా కెజిఎఫ్ కి కాపీలాగే ఉంది. 1970 గ్యాంగ్ వార్ బేస్ గా ఈ సినిమా తీసినట్లు దర్శకుడు ప్రేమ్ ప్రకటించటం చూడవచ్చు. కథ మీద అంత నమ్మకం ఉంటే ‘కాంతారా’ సినిమాలా ముందు కన్నడలో రిలీజ్ చేసి ఆ తర్వాత ఇతర భాషల్లో రిలీజ్ చేస్తే బాగుంటుందేమో. లేకుంటే ముందు వచ్చిన పాన్ ఇండియా ప్లాప్ చిత్రాల జాబితాలో ఇది కూడా చేరే అవకాశం ఉంది. సో ప్రేమ్ అండ్ అర్జున్ సర్జా బి కేర్ ఫుల్…
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?