Dharmendra Pradhan: విద్యార్థి నాయకుడి నుంచి కేంద్ర మంత్రి వరకు.. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్థానం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపారు. నీట్-యూజీ పరీక్షలో జరిగిన అవకతవకల చుట్టూ దేశవ్యాప్తంగా నెలకొన్న వివాదం, జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించి, తన రాజీనామాకు గల కారణాలను వివరించారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం..
ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశాలోని ఆంగుల్ జిల్లా తాల్చేర్‌లో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. 1983లో తాల్చేర్ కాలేజీలో హయ్యర్ సెకండరీ చదువుతున్న సమయంలోనే అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ద్వారా విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1985లో తాల్చేర్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రయాణానికి బలమైన పునాది వేసుకున్నారు. అనంతరం విద్యార్థి నాయకుడిగా వేగంగా ఎదుగుతూ, 1993లో ఏబీవీపీ ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా, 1995లో జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. విద్య విషయానికి వస్తే, ఒడిశాలోని ప్రముఖ ఉత్కల్ యూనివర్సిటీ (భువనేశ్వర్) నుంచి 1990లో ఆంత్రోపాలజీ (మానవశాస్త్రం) విభాగంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (M.A.) పట్టా పొందారు. 1998లో అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరిన ఆయన, అదే సంవత్సరంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
Also Read
- Dharmendra Pradhan: దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ రియాక్షన్..
- Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- CJP Protests: షాకింగ్.. సీజేపీ నిరసనల్లో 2,500 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తుల గుర్తింపు!
బీజేపీలో చేరిన తర్వాత ప్రధాన్ ఒడిశా ప్రత్యక్ష రాజకీయంలో కీలక పాత్ర పోషించారు. 2000లో ఒడిశా శాసనసభకు పల్లహరా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేవ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2012లో బీహార్ నుంచి, ఆ తర్వాత మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర స్థాయిలో కీలక నాయకుడిగా ఎదిగారు. బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పలు రాష్ట్రాల ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి అధిష్టానం నమ్మకాన్ని గెలుచుకున్నారు.
2014లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రిగా (స్వతంత్ర హోదా) బాధ్యతలు స్వీకరించారు. ‘ఉజ్వల యోజన’ పథకం ద్వారా దేశవ్యాప్తంగా పేద మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన పనితీరుకు గుర్తింపుగా 2017లో క్యాబినెట్ హోదాకు ప్రమోట్ అవ్వడమే కాకుండా, నైపుణ్యాభివృద్ధి శాఖ బాధ్యతలను కూడా చేపట్టారు. 2021లో కేంద్ర క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఆయనకు విద్యాశాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ బాధ్యతలు అప్పగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలోని సంబల్పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికై, మరోసారి కేంద్ర విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. ఒడిశాలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి తొలిసారి అధికారంలోకి రావడంలో కూడా ఆయన వ్యూహకర్తగా ముఖ్య భూమిక పోషించారు.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: విద్యార్థి నాయకుడి నుంచి కేంద్ర మంత్రి వరకు.. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్థానం ఇదే..
-
Dharmendra Pradhan: దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా.. ధర్మేంద్ర ప్రధాన్ ఫస్ట్ రియాక్షన్..
-
Collections : అసలు గ్రాస్, షేర్,నెట్ మధ్య తేడా ఏంటి?
-
Chennai Love Story: ‘బేబీ’ని మించిన హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్
-
Dharmendra Pradhan Resigns: విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!