Kethireddy: రీల్ లైఫ్.. రియల్ లైఫ్‌కి చాలా తేడా ఉంది.. పవన్‌కి క్రెడిబులిటీ లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kethireddy: టీడీపీ-జనసేన కలిసి ముందుకు నడుస్తాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు.. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ తాజా పరిణామాలపై సీరియస్‌గా స్పందించారు.. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పొత్తులపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించటం హాస్యాస్పదమన్న ఆయన.. పవన్ కల్యాణ్‌కు క్రెడిబులిటీ లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ ను టీడీపీ నేతలే ఓడిస్తారంటూ జోస్యం చెప్పారు.. టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో పవన్ కల్యాణ్ చెప్పాలని నిలదీశారు.. గతంలో ఎందుకు విడిపోయారు.. ఇప్పుడెందుకు కలుస్తున్నారో పవన్ చెప్పాలని ప్రశ్నించారు.
Read Also: Tollywood Drugs Case: టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం.. పరారీలో హీరో నవదీప్
Also Read
- IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
- India T20 Captaincy: సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
ఇక, ఓట్లు సంపాదించేందుకు ఎవరైనా రాజకీయ పార్టీలు పెడతారు.. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం ఓట్లు చీలకుండా ఉండేందుకు పార్టీ పెట్టానంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.. రీల్ లైఫ్ కి.. రియల్ లైఫ్ కు చాలా తేడా ఉందని పవన్ గుర్తించాలని సూచించారు.. మరోవైపు.. టీడీపీ – జనసేన పొత్తు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ లను విమర్శించి ఇప్పుడు వారితోనే పొత్తు అనడం అవివేకం అని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేష్ అవినీతిపరులని పవన్ కల్యాణ్ చెప్పారని గుర్తుచేశారు. అసలు పవన్ కల్యాణ్ బీజేపీతో సంప్రదించారో లేదో తెలియదని పేర్కొన్నారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.
తాజావార్తలు
-
SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
-
BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
-
IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
-
Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
-
India T20 Captaincy: సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!