Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Dharmasthala Rape Murder Allegations Cpi Narayana Comments

CPI Narayana : 500 అమ్మాయిలను రే*ప్ చేసి పూడ్చి పెట్టారు.. ధర్మస్థల ఘటనపై నారాయణ హాట్ కామెంట్స్

Published Date :August 9, 2025 , 7:24 pm
By Shiva Ganesh
CPI Narayana : 500 అమ్మాయిలను రే*ప్ చేసి పూడ్చి పెట్టారు..  ధర్మస్థల ఘటనపై నారాయణ హాట్ కామెంట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

CPI Narayana comments: కర్నాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల. రెండు దశాబ్దాల్లో అక్కడ అనేక మంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను తానే పూడ్చి పెట్టానని పారిశుద్ధ్య ఉద్యోగి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తన 20 ఏళ్ల సర్వీసులో, వందలాది శవాలను తాను ఖననం చేశానని, కొన్నిటిని డీజిల్ ఉపయోగించి కాల్చానని మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి, జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలే ఉన్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సామూహిక ఖనన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. మృతదేహాలు పూడ్చి పెట్టిన 15 అనుమానిత ప్రదేశాలను పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

READ MORE: Road Accident: రాఖీ పౌర్ణమి రోజు విషాదం.. చెల్లి వద్దకు రాఖీ కోసం వెళ్తూ అనంత లోకాలకు..

తిరుపతిలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ..
తిరుపతిలో శ్రీవారి దర్శనం అనంతరం సీపీఐ నారాయణ ధర్మస్థల అంశంపై మాట్లాడారు.. ధర్మస్థల ట్రస్ట్ ఒక కుటుంబం చేతిలో ఉందని, ట్రస్ట్ సభ్యులు 1980 నుంచి ఇప్పటి వరుకు 500 మంది అమ్మాయిలను రేప్ చేసి చంపేసి ఆలయ ప్రాంగణంలోనే పూడ్చిపెట్టారని ఆరోపించారు. ఘటనపై ప్రజలందరూ ఆందోళన చేస్తే కర్ణాటకలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి విచారణకు సిట్ వేసింది. అదే అక్కడ బీజేపీ సర్కార్ ఉంటే సిట్ వేసింది కాదన్నారు. గుడి కాంపోండ్ వెలుపల తవ్వకాలు చేపడితే ఎముకలు, పుర్రెలు బయటపడుతున్నాయని అన్నారు. అదేమన్న శ్మశాన వాటికనా, లేదా పవిత్ర దేవస్థలమా అని ప్రశ్నించారు. ధర్మస్థల ట్రస్ట్ ఛైర్మన్‌కి బీజేపీ బాసటగా ఉందని, ఆయను బీజేపీ వాళ్లు రాజ్యసభకు ఎంపీగా నామినేట్ చేయించారని తెలిపారు.

1980 లో ట్రస్ట్‌కు ఒక సీపీఎం నాయకుడు పోటీ చేశాడు. ట్రస్ట్ బోర్డుకు సంబంధం లేకుండా లోకల్ బోర్డుకు పోటీ చేయడానికి వీల్లేదన్నారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. ఇది జరిగిన ఐదో రోజు ఆయన మైనర్ కుమార్తెను రేప్ చేసి చంపేశారని తెలిపారు. అప్పటి నుంచి ఆ ట్రస్ట్‌లో ఉన్నవాళ్లు ఇవే పనులు చేసుకుంటూ వస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ డిమాండ్ ఏమిటంటే వెంటనే ఆ ట్రస్ట్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోని, ట్రస్ట్ బోర్డు సభ్యులందరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

READ MORE: Sathya Raj : తలమీద కాలు పెట్టే సీన్.. ప్రభాస్ అలా అన్నాడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 500 girls raped buried Karnataka
  • CPI demands trust takeover
  • CPI Narayana Dharmasthala
  • Dharmasthala rape case
  • Dharmasthala SIT investigation

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions