Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Prasada Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న గత న్యాయ తీర్పుల నేపథ్యంలో 34 శాతం రిజర్వేషన్ల జీవోలు కొట్టివేయబడతాయని తాము ముందే చెప్పామని ఆయన అన్నారు. అన్ని విషయాలు తెలిసి కూడా బీసీలను మభ్యపెట్టడం ఎందుకని ధర్మాన ప్రశ్నించారు. 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే వాటిని చట్టబద్ధంగా అమలు చేయాలని, కేవలం ప్రకటనలు చేయడం కాకుండా బీసీలకు ప్రయోజనం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు వివిధ పదవుల్లో ప్రాధాన్యం కల్పించామని ధర్మాన పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ 13 మేయర్ పదవుల్లో 9 పదవులను బీసీలకు కేటాయించారని, 13 జిల్లా పరిషత్‌లలో ఆరుగురిని జెడ్పీ చైర్మన్లుగా నియమించారని చెప్పారు. అలాగే 11 రాజ్యసభ స్థానాల్లో నాలుగు స్థానాలను బీసీలకు ఇచ్చామని, తొమ్మిది మంది బీసీలను మంత్రులుగా నియమించామని తెలిపారు. కేవలం ప్రకటనలు చేయడం కాకుండా పదవులు కేటాయించి బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించామని ధర్మాన అన్నారు. రిజర్వేషన్ల జీవోలు కోర్టులో నిలవవని తెలిసే బీసీలతో పాలాభిషేకాలు చేయించుకోవడం సరికాదని విమర్శించారు.
Also Read
- Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
బీసీలను చంద్రబాబు అసమర్థులుగా భావిస్తున్నారని ధర్మాన ఆరోపించారు. గవర్నర్, వైస్ ఛాన్సలర్ వంటి ఉన్నత పదవుల్లో బీసీలకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ ఎప్పుడూ బీసీల పార్టీ అని చెప్పుకుంటుందని, అయితే బీసీలకు వాస్తవంగా ఏం చేసిందో చూపించాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలను సవాలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ప్రభుత్వం రిజర్వేషన్లకు ఆధారంగా ఉపయోగించిన గణాంకాలు, నిర్ణయ ప్రక్రియపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?