NTV Telugu Site icon

Dharmana Prasada Rao: చంద్రబాబు హాయంలో అవినీతి జరిగింది.. దర్యాప్తు సంస్థలే చెబుతున్నాయ్

Darmana

Darmana

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంపై కొందరికి వాస్తవాలు తెలియనప్పుడు కక్షపూరితంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 2021 లోనే స్కిల్ డెవలప్మెంట్ లో అవకతవకలపై కేసు రిజిస్టర్ అయ్యింది.. ఎఫ్ఐఆర్ లో కొన్ని పేర్లు ఉంటాయి.. దర్యాప్తులో ఇంకొన్ని వస్తాయ్ అందులో తప్పెముంది అని ఆయన పేర్కొన్నారు. తనను అరెస్టే చేయకూడదని అంటే ఎట్లా?.. మన రాజ్యాంగ వ్యవస్దలో ఎవరికైనా మినహా ఇంపు ఉందా?.. అని మంత్రి ధర్మాన ప్రశ్నించారు.

Read Also: BigBoss 7: బిగ్ బాస్ హౌస్‎లోకి మరో 8 మంది క్రేజీ స్టార్స్.. ఇక రచ్చ రచ్చే

ఏ దర్యాప్తు సంస్థ అయినా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశ పెడుతుంది అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి జరిగిందని అనేక దర్యాప్తు సంస్దలు చెబుతున్నాయ్ అని ఆయన ఆరోపించారు. బాబుకి మినహాయింపు ఏముంటుంది?.. అమాయక ప్రజల్ని రెచ్చగొడ్డి ఉసిగొల్పడం కరెక్ట్ కాదు.. కోర్ట్ ముందు తమ నిర్దోషత్వం రుజువు చేసుకునేందుకు చంద్రబాబుకు అవకాశం వచ్చిందని ఆయన అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడే స్వచ్చందంగా ముందుకు రావాలి..
ఏదో రకంగా తప్పించుకోవాలని చూడటం కరెక్ట్ కాదు అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తెలిపారు.

Read Also: G-20 Summit: రెండోరోజు G20 సమావేశాలు.. వాటిపైనే చర్చలు

దర్యాప్తు సంస్థలను తప్పుబట్టడం ఏంటి?.. మాజీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిందొకటేనని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. 37 మంది ఇన్వాల్వ్ మెంట్ ఉంది.. మీరు నిర్దోషిగా బయటకు వచ్చేప్రయత్నం చేయాలి.. దేశంలో ఇదేం కొత్తకాదు.. లా అండ్ అర్డర్ సమష్య సృష్టించడం ఏంటి?.. అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో కోర్ట్ కంటే ముందు ప్రజలే దోషిగా నిర్దారించేస్తారు అని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు పేర్కొన్నారు.